Share News

చిత్రాడలో 14న జనసేన ఆవిర్భావ సభ

ABN , Publish Date - Mar 02 , 2025 | 12:26 AM

కలెక్టరేట్‌ (కాకినాడ), మార్చి 1 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో ఈనెల 14న నిర్వహించను న్న జనసేన ఆవిర్భావ సభను విజ

చిత్రాడలో 14న జనసేన ఆవిర్భావ సభ

ప్రతి నాయకుడు, కార్యకర్త ఐకమత్యంగా

పని చేసి విజయవంతం చేయాలి

జనసేన పీఏసీ చైర్మన్‌, మంత్రి నాదెండ్ల మనోహర్‌

కాకినాడలో సన్నాహక సమావేశం

కలెక్టరేట్‌ (కాకినాడ), మార్చి 1 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో ఈనెల 14న నిర్వహించను న్న జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ పీఏసీ చైర్మన్‌, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ పిలుపునిచ్చారు. శనివారం కాకినాడ కుళాయి చెరువులో ఉన్న గోదావరి కళా క్షేత్రంలో కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో కుడా చైర్మన్‌ తుమ్మలబాబు అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. జనసేన పార్టీ పదేళ్లపాటు ప్రజల్లో ఉంటూ అనేక కష్టనష్టాలను ఎదుర్కొని ఈ రోజు రాష్ట్రంలో ఒక బలమైన పార్టీగా అవతరించిందన్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో జనసైనికలు మన పార్టీని కాపాడిన విధానం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. కష్టపడి పనిచేసి జెండాను మోసిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందన్నారు.

ద్వారంపూడి అహంకారంతో విర్రవీగారు

అధికారం ఉందనే అహంకారంతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అహంకారంతో విర్రవీగారని మంత్రి నాదెండ్ల విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో పవన్‌కల్యాణ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలకు జనసేన కార్యకర్తలు నిరసన చేపట్టగా వారిపై ద్వారంపూడి దాడులు చేయించడమే కాకుండా అక్రమ కేసులు బనాయించి అరెస్ట్‌లు చేశారన్నారు. ఇప్పటికీ జనసైనికులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని, అయినా జనసేన శ్రేణులు ధైర్యం కోల్పోకుండా పోరాటం చేస్తున్నారని ఆయన చెప్పారు.

గత ఐదేళ్లు వైసీపీ విధ్వంసం

గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో విధ్వంస కార్యక్రమాలు చేసిందని మంత్రి నాదెండ్ల ధ్వజమెత్తారు. ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయకుండా వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. రోడ్లపై ఉన్న ఒక్క గుంతను కూడా పూడ్చలేద న్నారు. ఇప్పుడు ఆ గుంతలను పూడ్చడానికి రూ.1600కోట్లు కేటాయించినా సరిపోవడం లేదన్నారు. పవన్‌పై అవాకులు చవా కులు పేలుతున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై కూడా చర్యలు ఉంటాయన్నారు. గత ప్రభుత్వం రైతులకు ధాన్యం బకాయిలు రూ.1600 కోట్లు పెట్టి వెళ్లిపోతే మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని రైతులకు చెల్లించామని మంత్రి నాదెండ్ల తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల వ్యవధిలో అన్నదాత బ్యాంకు ఖాతాల్లో ప్ర భుత్వం సొమ్ములు జమ చేస్తుందన్నారు.

కాకినాడలో కంట్రోల్‌రూమ్‌

జనసేన ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయడానికి కాకినాడ కుళాయిచెరువు వద్ద ఒక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్టు మంత్రి నాదెండ్ల తెలిపారు. ఈనెల 8వ తేదీ నుంచి ఇది అందుబాటులోకి వస్తుందన్నారు. కంట్రోల్‌ రూమ్‌లో సమీక్షలు నిర్వహించుకుని ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లు ఘనంగా చేస్తామ న్నారు. కమిటీల్లో పేర్లు లేకపోయినంత మాత్రాన మీరు పని చే యొద్దని కాదని, ప్రతిఒక్కరూ పనిచేస్తేనే సభ విజయవంతం అవుతుందన్నారు. జనసేన సభ్యత్వాలు 60వేల నుంచి 12.42లక్షల వరకు పెరిగాయని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి నాయకుడు, కార్యకర్త ఐకమత్యంగా పనిచేసి సభను విజయవంతం చేయాలన్నారు.

వేడుకలకు కమిటీలు ఏర్పాటు : మంత్రి దుర్గేష్‌

జనసేన ఆవిర్భావ వేడుకల విజయవంతానికి 500మందితో 14 కమిటీలు రూపొందించామని రాష్ట్ర పర్యా టక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందులు దుర్గేష్‌ తెలిపారు. కమిటీలు నిరంతరం పర్యవేక్షించి సభను విజయవంతం చేస్తాయన్నారు. రాష్ట్ర భవిష్యత్తు జనసేనపైన ఉందన్నారు. నిష్కలంకమైన మన నాయకుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆలోచన వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత నిర్వహించే తొలి సభ కావడంతో అందరూ సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలన్నారు. ఎంపీ తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్‌, శాసనమండలి ప్రభుత్వ విప్‌ పిడుగు హరిప్రసాద్‌, రాష్ట్ర సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ తోట సుధీర్‌, కాకినాడ అర్బన్‌ డెవల ప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌ తుమ్మల రామస్వామి, శాసనసభలో ప్రభుత్వ విప్‌లు బొమ్మిడి నాయకర్‌, బొలిశెట్టి శ్రీనివాస్‌, అవర శ్రీధర్‌, జనసేన ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు.

Updated Date - Mar 02 , 2025 | 12:26 AM