Share News

Maredumilli Encounter: భారీ ఎన్ కౌంటర్.. పలువురు మావోయిస్ట్ అగ్రనేతలు మృతి.!

ABN , Publish Date - Nov 18 , 2025 | 09:39 AM

మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రత బలగాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో పలువురు అగ్రనేతలు మృతి చెందారు.

Maredumilli Encounter: భారీ ఎన్ కౌంటర్.. పలువురు మావోయిస్ట్ అగ్రనేతలు మృతి.!
Maredumilli Encounter

అల్లూరి సీతారామరాజు జిల్లా: మారేడుమిల్లి అడవుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మావోయిస్టులు, భద్రత బలగాల మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో అగ్రనేత హిడ్మా మృతి చెందినట్లు తెలుస్తోంది.


అక్కడి లోతట్టు అటవీ ప్రాంతాల్లో మావోయిస్ట్ నేతలు షెల్టర్ తీసుకున్నారనే విశ్వసనీయ సమాచారం పోలీసులకు అందడంతో, భద్రతా బలగాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని కాల్పులు జరిపాయి. ఎక్స్ చేంజ్ ఆఫ్ ఫైర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారని సమాచారం.

Hedma.jpg


ఈ విషయంపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ.. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల సమయంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయని తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారని, వారిలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఉన్నారని స్పష్టం చేశారు.

ఎన్ కౌంటర్ ప్రదేశానికి చేరుకున్న పోలీస్ బలగాలు.. హిడ్మా తో పాటు ఉన్న మిగతా మావోయిస్ట్ నేతలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్ర హోమ్ శాఖ అధికారులు నేరుగా ఎన్‌కౌంటర్ సమాచారాన్ని సేకరిస్తున్నట్టు సమాచారం.


Also Read:

కృష్ణా డెల్టాకు గోదారమ్మ పరుగులు

ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికి ఎంఆర్‌ఓ ఆఫీస్‌..!

For More Latest News

Updated Date - Nov 18 , 2025 | 11:17 AM