Share News

Tehsildar Office for Sale: ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికి.. ఎమ్మార్వో ఆఫీస్‌..!

ABN , Publish Date - Nov 18 , 2025 | 04:51 AM

ఓఎల్‌ఎక్స్‌లో ఎవరైనా పాత వస్తువులను అమ్మవచ్చు.. కొనవచ్చు..! ఇదొక చక్కటి వేదిక. కానీ.. ఓ ప్రబద్ధుడు ఏకంగా తహసీల్దార్‌ కార్యాలయాన్నే...

Tehsildar Office for Sale: ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికి.. ఎమ్మార్వో ఆఫీస్‌..!

  • రూ.20 వేలకు విక్రయానికి పెట్టిన ప్రబుద్ధుడు

గిద్దలూరు టౌన్‌, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): ఓఎల్‌ఎక్స్‌లో ఎవరైనా పాత వస్తువులను అమ్మవచ్చు.. కొనవచ్చు..! ఇదొక చక్కటి వేదిక. కానీ.. ఓ ప్రబద్ధుడు ఏకంగా తహసీల్దార్‌ కార్యాలయాన్నే ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికి పెట్టాడు. గుర్తుతెలియని వ్యక్తి.. ప్రకాశం జిల్లా గిద్దలూరు తహసీల్దార్‌ కార్యాలయం ఫొటోను ఓఎల్‌ఎక్స్‌లో పెట్టి.. దాన్ని రూ.20 వేలకే అమ్ముతానని ప్రకటించాడు. ఈ పోస్టు రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోం ది. అప్రమత్తమైన గిద్దలూరు తహసీల్దార్‌ ఎం.ఆంజనేయరెడ్డి దీనిపై సోమవారం అర్బన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే దీనిపై ఆరా తీసిన పోలీసులు అనుమానితుడు హైదరాబాద్‌లో ఉంటున్నట్టు తెలుసుకుని సోమవారం రాత్రి తెలంగాణ పోలీసుల సహకారంతో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

Updated Date - Nov 18 , 2025 | 11:35 AM