Share News

పుష్‌కార్ట్‌ల ద్వారా ఇంటింటా చెత్త సేకరణ

ABN , Publish Date - Feb 03 , 2025 | 12:06 AM

పిఠాపురం, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): పుష్‌కార్ట్‌ల ద్వారా ఇంటింటా చెత్త సేకరణ, డ్రెయిన్లల్లో పూడిక తొలగింపు, వీధుల్లో చెత్తాచెదారం తొలగించి ట్రాక్టర్ల ద్వారా తరలింపు ఇలా అక్కడ పారిశుధ్య సమస్యలకు పరిష్కారం చూపించింది ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి చర్చావేదిక. గతంలో నెలకు ఒకసారి కూడా డ్రెయిన్లల్లో పూడిక

పుష్‌కార్ట్‌ల ద్వారా ఇంటింటా చెత్త సేకరణ

డ్రెయిన్లల్లో పూడిక తొలగింపు

ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి చర్చా వేదికతో పారిశుధ్య సమస్యలకు పరిష్కారం

పిఠాపురం, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): పుష్‌కార్ట్‌ల ద్వారా ఇంటింటా చెత్త సేకరణ, డ్రెయిన్లల్లో పూడిక తొలగింపు, వీధుల్లో చెత్తాచెదారం తొలగించి ట్రాక్టర్ల ద్వారా తరలింపు ఇలా అక్కడ పారిశుధ్య సమస్యలకు పరిష్కారం చూపించింది ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి చర్చావేదిక. గతంలో నెలకు ఒకసారి కూడా డ్రెయిన్లల్లో పూడిక తొలగించేవారు కాదని, ఇప్పుడు ప్రతి రోజూ ఏదొక సమయంలో డ్రెయిన్లు శుభ్రం చేస్తున్నారని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.

ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేసేందుకుగానూ ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన అక్షరం అండగా...పరిష్కారమే అజెండాగా పిఠాపురం 18వ వార్డు కుంతీమాధవస్వామి ఆలయం వద్ద నిర్వహించిన చర్చావేదికలో వార్డు కౌన్సిలరు పంపనబోయిన అన్నపూర్ణ, ప్రజలు, వివిధ సంఘాల ప్రతినిధులు పారిశుధ్య సమస్యను ప్రదానంగా ప్రస్తావించారు. వీధుల్లో చెత్తాచెదా రం సక్రమంగా తొలగించడం లేదని, ఇంటింటా చెత్త సేకరణ జరగడం లేదని, డ్రెయిన్లల్లో రోజులు, నెలల తరబడి పూడికలు తీయడం లేదని వివరించారు. దీనిపై మున్సిపల్‌ కమిషనరు నామా కనకారావు స్పందించి పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించారు. శానిటరీ ఇనస్పెక్టర్‌ ప్రభాకర్‌తో పాటు సచివాలయ సిబ్బంది పర్యవేక్షణలో రోజూ పారిశుధ్య నిర్వహణ జరగాలని ఆదేశించారు. ఇందు కోసం ప్రత్యేకంగా ఆరుగురు సిబ్బందిని నియమించారు. వారు వీధుల్లో రోజూ చెత్తాచెదారం తొలగించడం ద్వారా పుష్‌కార్ట్‌ల ద్వారా ఇంటింటా చెత్తను సేకరిస్తున్నారు. డ్రెయిన్లల్లో పూడికను తొలగించడంతో పాటు శుభ్రం చేస్తూ లార్వా నివారణకు ప్రత్యేక మందును పిచికారీ చేశారు.

Updated Date - Feb 03 , 2025 | 12:06 AM