Share News

AP News: కోయంబత్తూరు నుంచి ఫోన్.. డీఎస్సీ సెలెక్ట్‌ అభ్యర్థి వీడియో కాల్‌

ABN , Publish Date - Sep 12 , 2025 | 01:27 PM

డీఎస్సీ-2025లో అనర్హుల ఏరివేత కొనసాగుతోంది. అదే సమయంలో అర్హులు ఎక్కడున్నా అవకాశం కల్పిస్తున్నారు. డీఎస్సీ రాసిన అభ్యర్థులు తుది జాబితాలో చోటు దక్కకపోవడంతో ఆశలు వదులుకున్నారు. తమ పనుల్లో నిమగ్నమయ్యారు. సర్టిఫికెట్ల పరిశీలన పకడ్బందీగా చేపట్టడంతో బోగస్‏లు బయటపడ్డారు.

AP News: కోయంబత్తూరు నుంచి ఫోన్.. డీఎస్సీ సెలెక్ట్‌ అభ్యర్థి వీడియో కాల్‌

- సర్టిఫికెట్ల పరిశీలనకు వస్తున్నానంటూ సమాచారం

- కొత్తగా ముగ్గురు డీఎస్సీ అభ్యర్థులకు కాల్‌ లెటర్లు

- ఇద్దరి సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి

అనంతపురం: డీఎస్సీ-2025లో అనర్హుల ఏరివేత కొనసాగుతోంది. అదే సమయంలో అర్హులు ఎక్కడున్నా అవకాశం కల్పిస్తున్నారు. డీఎస్సీ రాసిన అభ్యర్థులు తుది జాబితాలో చోటు దక్కకపోవడంతో ఆశలు వదులుకున్నారు. తమ పనుల్లో నిమగ్నమయ్యారు. సర్టిఫికెట్ల పరిశీలన పకడ్బందీగా చేపట్టడంతో బోగస్‏లు బయటపడ్డారు. వారిని రిజెక్ట్‌ చేయడంతో కొత్త వారిని అవకాశం వెతుక్కుంటూ వెళ్తోంది. తాజాగా మరో ముగ్గురు డీఎస్సీ అభ్యర్థులకు జిల్లా విద్యాశాఖాధికారులు కాల్‌ లెటర్లు పంపారు. సాయంత్రంలోగా సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలని అందులో ఆదేశించారు. కోయంబత్తూరు(Coimbatore)లో ఉన్న ఓ అభ్యర్థి.. విద్యాశాఖ అధికారులకు వీడియో కాల్‌ చేశారు. తాను కోయంబత్తూరులో ఉన్నానంటూ సమాచారం ఇచ్చారు.


మళ్లీ.. మళ్లీ.. పరిశీలన

నిబంధనల మేరకు అర్హత ఉంటే ఎక్కడ ఉన్నా ఉద్యోగం వస్తుందనడానికి డీఎస్సీ-2025 నియమకాల పక్రియే నిదర్శనం. జిల్లాలో 807 టీచర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. వేలాదిమంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఈసారి బోగ్‌సలను ఏరివేసి నిజమైన అర్హులకే ఉద్యోగాలు కట్టబెట్టాలని సర్కారు పటిష్ట చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే డీఎస్సీ నియామకాల పక్రియను రాష్ట్రవిద్యాశాఖ ఉన్నతాధికారుల ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు.


ఇప్పటి వరకు జిల్లాలో 773 మంది అభ్యర్థులకు ఎంపిక కాల్‌ లెటర్లు వచ్చాయి. వారందరి ఒరిజనల్‌ సర్టిఫికెట్లను జిల్లా విద్యాశాఖ నేతృత్వంలో ప్రత్యేక కమిటీలు పరిశీలించాయి. ఇప్పటికి ఐదుసార్లు పరిశీలన చేయించారు. అనుమానం, ఆరోపణలు వచ్చిన అభ్యర్థుల సర్టిఫికెట్లపై సంబంధిత శాఖలకు పంపి, అక్కడి నుంచి ఆమోదం లభిస్తేనే ఆమోదం తెలుపుతున్నారు. లేదంటే రిజెక్ట్‌ చేస్తున్నారు. ఇలాంటివి జిల్లాలో 14 తిరస్కరించారు. మరో నాలుగైదింటిపై సంబంధిత శాఖల నివేదికల కోసం వేచి చూస్తున్నారు.


తాజాగా మరో ముగ్గురికి కాల్‌లెటర్లు

డీఎస్సీ నియామకాల పక్రియ ముగింపు దశకు చేరుకోవడంతో పూర్తిస్థాయిలో సెలెక్షన్‌ లిస్టు తయారు చేసి ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే డ్యూయల్‌ పోస్టులు, అసత్య సమాచారంతో రిజక్ట్‌ అయిన అభ్యర్థుల స్థానంలో ఆ తరువాతి స్థానాల్లో ఉన్న వారికి రాష్ట్రశాఖ కాల్‌లెటర్లు(Call letters) పంపిస్తోంది. అందులో భాగంగా గురువారం మరో ముగ్గురు డీఎస్సీ అభ్యర్థులకు కాల్‌లెటర్లు వచ్చాయి. ఆ జాబితాలో ఉన్న అభ్యర్థులను పిలిపించుకుని సాయంత్రంలోగా సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసి, నివేదికలు పంపాలని రాష్ట్ర శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి.


ఇద్దరు అభ్యర్థులు జిల్లాలోనే ఉన్నారు. వారు సాయంత్రానికి సర్టిఫికెట్లు తీసుకొచ్చి పరిశీలన చేయించుకున్నారు. రాయదుర్గానికి చెందిన అభ్యర్థి రమ్యశిల్ప కోయంబత్తూరులో ఉన్నట్లు విద్యాశాఖ అధికారులకు తెలిపారు. వీడియోకాల్‌ చేసి కోయంబత్తూరులో ఉన్నాననీ, బయల్దేరానంటూ విద్యాశాఖ ఐటీసెల్‌ సిబ్బందికి వివరణ చేసుకున్నారు. అదేవీడియోకాల్‌ మాటలను రికార్డు చేసుకుని, డీఈఓ ప్రసాద్‌బాబుకు ఆమె పంపించారు. దీనిని బట్టి అర్హత ఉంటే ఎక్కడున్నా ఉద్యోగం వస్తుందని స్పష్టమైంది.


ఈ వార్తలు కూడా చదవండి..

967 డిగ్రీ కళాశాలల్లో 2.41 లక్షల సీట్లు

లాకర్‌ తాళాల కోసం చిత్ర హింసలు పెట్టి..

Read Latest Telangana News and National News

Updated Date - Sep 12 , 2025 | 01:27 PM