Share News

Damodara Naidu: పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌గా దామోదర్‌నాయుడు పునర్నియామకం

ABN , Publish Date - Aug 07 , 2025 | 04:48 AM

రాష్ట్ర పశు సంవర్ధకశాఖ డైరెక్టర్‌గా గత నెల 31న ఉద్యోగ విరమణ చేసిన డాక్టర్‌ టీ దామోదర్‌నాయుడిని తిరిగి

Damodara Naidu: పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌గా దామోదర్‌నాయుడు పునర్నియామకం

అమరావతి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పశు సంవర్ధకశాఖ డైరెక్టర్‌గా గత నెల 31న ఉద్యోగ విరమణ చేసిన డాక్టర్‌ టీ దామోదర్‌నాయుడిని తిరిగి అదే పోస్టులో నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనా సౌలభ్యం కోసం ఏడాది పాటు లేదా తిరిగి ఉత్తర్వులు జారీ చేసే వరకు పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌గా దామోదర్‌నాయుడు కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌గా ఈ పునర్నియామకాన్ని సర్వీస్‌ పొడిగింపుగా గుర్తించమని, తిరిగి ఉపాధి కల్పన కోసం కొత్త నియామకంగా మాత్రమే పరిగణిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఒక పార్టీని టార్గెట్ చేస్తారా.. ఎంపీపై సుప్రీం అసహనం, రూ.10 లక్షల జరిమానా

ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు

For AndhraPradesh News And Telugu News

Updated Date - Aug 07 , 2025 | 04:48 AM