Share News

VIjayawada CP :సైబర్ క్రైమ్ బాగా పెరిగింది

ABN , Publish Date - Jan 22 , 2025 | 08:30 PM

VIjayawada CP :తమకు ప్రజలంటే ఎంతో అభిమానం, ప్రాణమని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు తెలిపారు. ‌వారి కోసం ఎన్నో సేవ కార్యక్రమాలను వృత్తి పరంగా, వ్యక్తిగతంగా చేశామన్నారు.

VIjayawada CP :సైబర్ క్రైమ్ బాగా పెరిగింది
Vijayawada CP Rajasekharababu

విజయవాడ, జనవరి 22: ప్రజల పట్ల పూర్తి బాధ్యతతో పోలీస్ శాఖ పని చేస్తోందని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు స్పష్టం చేశారు. ప్రజలకు ఎటువంటి కష్టం, ఇబ్బంది ఉన్నా.. వెంటనే స్పందించి ముందుకు వస్తామన్నారు. బుధవారం విజయవాడలో సీపీ రాజశేఖరబాబు విలేకర్లతో మాట్లాడుతూ.. తాను నగర పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం కమాండ్ కంట్రోల్ రూమ్‌పై దృష్టి పెట్టానన్నారు. సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో కంట్రోల్ రూమ్ వ్యవస్థ సరిగ్గా లేదని చెప్పారు.

అయితే కెమెరాలు కొనుగోలు చేసి కంట్రోల్ రూమ్ వ్యవస్థను ఆధునీకరించామని తెలిపారు. అలాగే పోలీస్ శాఖలో సాంకేతిక పరికరాలను అందుబాటులోకి సైతం తీసుకు వచ్చామని పేర్కొన్నారు. అందులోభాగంగా 10 వేల‌ మీటర్ల రోప్ కొనుగోలు చేశామని.. అదే విధంగా 1900 కెమెరాలను కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశామని వివరించారు. ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్ బాగా పెరిగిందన్నారు. ఆన్ లైన్ మోసాల బారిన పడకుండా ఉండేలా ప్రజల్లో అవగాహన తేచ్చే కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఏ తరహా మోసాలు అధికంగా జరుగుతున్నాయో గుర్తించామని.. వాటిని‌ నియంత్రించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు.


విజయవాడలో వరదలు వచ్చిన సమయంలో పోలీసు శాఖ నిద్రాహారాలు మాని విధులు నిర్వర్తించిందని ఆయన గుర్తు చేశారు. తమకు ప్రజలంటే ఎంతో అభిమానం, ప్రాణమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ‌వారి కోసం ఎన్నో సేవ కార్యక్రమాలను వృత్తి పరంగా, వ్యక్తిగతంగా చేశామన్నారు.

Also Read: తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు జడ్జిలు నియామకం


ముఖ్యమంత్రి, డీజీపీ ఆదేశాలు, సూచనలతో తమకు సేవ చేసేలా అవసరమైన సౌకర్యాలు కల్పించారన్నారు. దసరా ఉత్సవాలు సమయంలో లక్షల సంఖ్యలో వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా పోలీసులు పక్కా ప్రణాళికతో పని చేశారని తెలిపారు. మోడల్ గెస్ట్ హౌస్‌లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేశామన్నారు. డ్రోన్ కెమెరాలు కొనుగోలు చేసి.. వాటి ద్వారా భక్తుల రద్దీని పరిశీలించి తగిన విధంగా చర్యలు తీసుకున్నామని వివరించారు.

Also Read: ప్రయాణికులపై నుంచి దూసుకెళ్లిన రైలు: పలువురు మృతి


భవానీ దీక్షల విరమణ సమయంలో సైతం డ్రోన్ కెమెరాలు ద్వారా రద్దీని బట్టి భక్తులను పంపామన్నారు. దసరా ఉత్సవాలు సమయంలో జరిగిన చిన్న చిన్న తప్పిదాలను సరి చేసి.. భవానీ దీక్షల విరమణలో ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేశామని వివరించారు. ఇక ప్రతి పోలీస్ స్టేషన్‌కు డ్రోన్ కెమెరాలను కొనుగోలు చేశామన్నారు. అందుకు కొంత మంది ప్రజాప్రతినిధులు కూడా తమకు సహకారం అందించారని గుర్తు చేసుకున్నారు.

Also Read: : గడ్డ కట్టే చలిలో సమావేశానికి నడిచి వెళ్లిన మంత్రి నారా లోకేష్


ఎక్కడ ఉన్నా ఫోన్‌లో చూసి మానటరింగ్ చేసేలా సాంకేతికతను వినియోగించుకున్నామన్నారు. డ్రోన్ పైలెట్స్‌గా వంద మంది మహిళా కానిస్టేబుళ్లకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. మహిళా పోలీసులు బాగా పని చేస్తున్నారు.. వారికి ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు. హెల్మెట్, సీటు బెల్ట్ వాడకంపై ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చామన్నారు.

Also Read: రాజధాని అమరావతికి మళ్లీ గుడ్ న్యూస్


ఎనభై శాతం మంది ప్రజల్లో అందుకు అనుగుణంగా మార్పు వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. అలాగే వంద శాతం ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా ప్రజలల్లో అవగాహన కల్పిస్తామన్నారు. గౌరవ హైకోర్టు ఆదేశాలను అందరూ పాటించాలని ప్రజలకు ఆయన సూచించారు. ట్రాఫిక్ మేనేజ్‌‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి.. అందుకు అనుగుణంగా మార్పులు చేస్తున్నామని నగర సీపీ రాజశేఖరబాబు వివరించారు.

Also Read: బిహార్ సీఎం నితీష్ కీలక నిర్ణయం.. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణ

For AndhraPradesh News And Telugu News

Updated Date - Jan 22 , 2025 | 08:39 PM