Nellore Penchalaiah Murder: నెల్లూరు పెంచలయ్య హత్య కేసులో నిందితులపై పోలీస్ కాల్పులు
ABN , Publish Date - Nov 29 , 2025 | 08:35 AM
నెల్లూరు హౌసింగ్ బోర్డు కాలనీలో పెంచలయ్య అనే ప్రజానాట్య మండలి కళాకారుడి హత్య కేసు నిందితులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక నిందితుడు, హెడ్ కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. అరవ కామాక్షమ్మ అనే మహిళ ఈ హత్యకు ప్రధాన సూత్రధారిగా..
నెల్లూరు, నవంబర్ 29: నెల్లూరులో సంచలనం రేపిన పెంచలయ్య హత్య కేసులో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. హత్యకేసు నిందితులని పట్టుకునే క్రమంలో నెల్లూరు రూరల్ పోలీసులు ఫైర్ ఓపెన్ చేశారు. ఈ ఘటనలో నిందితుడు, హెడ్ కానిస్టేబుల్‌కి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వీరిని జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు.
ఇలా ఉండగా, నెల్లూరు హౌసింగ్ బోర్డు కాలనీలో పెంచలయ్య అనే వ్యక్తి హత్యకు గురైన సంగతి తెలిసిందే. ముసుగులు ధరించిన దాదాపు తొమ్మిది మంది.. పెంచలయ్య స్కూటీపై వెళ్తుండగా వెంబడించి దారుణంగా హత్య చేశారు. మృతుడు సీపీఎం ఆర్డీటీ కాలనీ శాఖ సభ్యుడు, ప్రజానాట్య మండలి కళాకారుడు.
అయితే, ఈ హత్య చేయించింది ఒక మహిళగా తెలుస్తోంది. కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో గంజాయి మాఫియాని నడుపుతున్న అరవ కామాక్షమ్మ అనే మహిళ ఈ హత్యకు ప్రధాన సూత్రధారిగా పోలీసులు భావిస్తున్నారు. కామాక్షమ్మ తొమ్మిది సభ్యుల గంజాయి గ్యాంగ్ తో ఒప్పందం కుదుర్చుకుని పెంచలయ్య హత్యకి పురమాయించినట్టు తెలుస్తోంది. నెల్లూరు నగరంలో రెచ్చిపోతున్న గంజాయి గ్యాంగుల అరాచకాలకు ఇది పరాకాష్టగా నిలుస్తోంది. పెంచలయ్య హత్య విషయం తెలిసిన వెంటనే సీపీఎం నేతలు, కార్యకర్తలు భారీగా ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకుని నినాదాలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజకీయ నినాదాలు కాదు.. వివక్షకు ఆధారాలు చూపాల్సిందే
ముఖ్యమంత్రా.. రియల్ ఎస్టేట్ ఏజెంటా..?
Read Latest Telangana News and National News