CPI State Secretary Ramakrishna: బీసీలకూ రిజర్వేషన్లు కల్పించాలి..
ABN , Publish Date - Sep 14 , 2025 | 12:12 PM
జనాభా ప్రాతిపదికన బీసీలకు స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్ కల్పించాని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. బీసీలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పించాలనే అంశంపై ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
విజయవాడ: జనాభా ప్రాతిపదికన బీసీలకు స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్ కల్పించాని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. బీసీలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పించాలనే అంశంపై ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రఘువీరారెడ్డి, కొలనుకొండ శివాజీ, జల్లి విల్సన్, దోనేపూడి శంకర్, కోటేశ్వరరావు, ఇతర ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ జన గణనతో పాటు, కులగణన కూడా చేయాలని డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించిన విధంగా.. బీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఈ రెండు అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనిట్లు చెప్పారు.
పక్కన ఉన్న తెలంగాణాలో కుల గణన అమలు చేశారని, కర్నాటలో కూడా ప్రకటించారని.. మన ఏపీలో కూడా కుల గణన జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ సాధించుకునేందుకు ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలపై ఈరోజు సమావేశంలో చర్చిస్తున్నామన్నారు. 143 వెనుక బడిన కులాలు ఉండగా, బీసీలకు స్థానాలు తగ్గించడం వల్ల బీసీలు పదవులు కోల్పోయారని చెప్పారు. తెలంగాణాలో కుల గణన జరిగిన నేపథ్యంలో బీసీలకు పదవులు వచ్చాయని, ఏపీలో కూడా ఇదే విధంగా కుల గణన చేపట్టి.. బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని తీర్మానం చేశామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపుతామని రామకృష్ణ పేర్కొన్నారు.