CPI Leader Rama Krishna : ‘వీసీ’ల సెర్చ్ కమిటీని పునర్నియమించాలి
ABN , Publish Date - Jan 26 , 2025 | 05:46 AM
సెర్చ్ కమిటీని ప్రముఖ విద్యావేత్తలతో పునర్నియమించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు.
ముఖ్యమంత్రికి సీపీఐ రామకృష్ణ లేఖ
అమరావతి, జనవరి 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్సలర్ల నియామకానికి సెర్చ్ కమిటీని ప్రముఖ విద్యావేత్తలతో పునర్నియమించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు శనివారం ఆయన లేఖ రాశారు. ప్రభుత్వం నియమించిన సెర్చ్ కమిటీలో 70 శాతం మంది సభ్యులు బలమైన రాజకీయ సంబంధాలు కలిగి ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుబంధంగా ఉన్నారని, పైగా వారంతా చురుకైన విద్యావేత్తలు కాదని తెలిపారు. వైస్ చాన్సలర్లుగా సరైన అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియను అర్హత కలిగిన విద్యావేత్తలకు అప్పగించాలని రామకృష్ణ కోరారు.