Share News

Manginapudi Beach: కానిస్టేబుళ్ల సాహసం.. సముద్రంలోకి వెళ్లి..

ABN , Publish Date - Oct 12 , 2025 | 05:40 PM

కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో ఇద్దరు కానిస్టేబుల్స్ తమ ప్రాణాలకు తెగించి నలుగురు యువకులను కాపాడారు. కపిలేశ్వరానికి చెందిన యువకులు అబ్దుల్ అసిఫ్, ఎస్‌కే ఆర్ఫాద్, ఎస్‌కే సికిందర్, షరీఫ్ ఆదివారం ఉదయం బీచ్‌కు వచ్చారు. బీచ్‌లో స్నానం చేస్తుండగా అలల ఉద్ధృతికి వారు గందరగోళానికి గురయ్యారు.

Manginapudi Beach: కానిస్టేబుళ్ల సాహసం.. సముద్రంలోకి వెళ్లి..
Manginapudi Beach

అమరావతి, అక్టోబర్ 12: ప్రజా సేవే పరమార్థంగా భావించే పోలీసులు.. తమ డ్యూటీ చేసుకోవడం మాత్రమే తమ పని కాదని, ఎవరైనా ఏదైనా చిక్కుల్లో ఉన్నప్పుడు సహాయం చేయడమూ తమ బాధ్యతేనని మరోమారు నిరూపించుకున్నారు. ఆంధ్ర‌ప్రదేశ్‌లో ఇద్దరు కానిస్టేబుళ్ల సాహసం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సముద్రంలోకి వెళ్లి నలుగురు యువకులను కాపాడారు ఇద్దరు కానిస్టేబుళ్లు. దీంతో పోలీసుల ధైర్య సాహసాలను బీచ్‌లో ఉన్నవారు కొనియాడారు.


కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో ఇద్దరు కానిస్టేబుళ్లు తమ ప్రాణాలకు తెగించి నలుగురు యువకులను కాపాడారు. కపిలేశ్వరానికి చెందిన యువకులు అబ్దుల్ అసిఫ్, ఎస్‌కే ఆర్ఫాద్, ఎస్‌కే సికిందర్, షరీఫ్ ఆదివారం ఉదయం బీచ్‌కు వెళ్లారు. బీచ్‌లో స్నానం చేస్తుండగా అలల ఉద్ధృతికి వారు గందరగోళానికి గురయ్యారు. వారిని గమనించిన కానిస్టేబుల్స్ నాంచారయ్య, శేఖర్‌ హుటాహుటిన నీటిలోకి వెళ్లి.. వారిని ప్రాణాలతో ఒడ్డుకు చేర్చారు. వీరిద్దరి సాహసంతో నలుగురు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. కానిస్టేబుళ్ల మానవతా హృదయాన్ని, ధైర్య సాహసాలను పలువురు ప్రశంసిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

Pawan Kalyan on Youth Welfare: యువత కలలు సాకారం చేసేందుకు కృషి చేస్తాం:పవన్ కల్యాణ్

Honor Killing In Guntur District: గుంటూరు జిల్లాలో మరో పరువు హత్య

Updated Date - Oct 12 , 2025 | 07:34 PM