Share News

CM Chandrababu: ఆ ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్..

ABN , Publish Date - Jun 29 , 2025 | 07:20 PM

తెలుగుదేశం విస్తృత స్థాయి సమావేశానికి గైర్హాజరైన వారిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాలకంటే ఇతర పనులు ఎక్కువయ్యాయా? అంటూ అసహనం వ్యక్తం చేశారు.

CM Chandrababu:  ఆ ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్..
CM Chandrababu

అమరావతి: తెలుగుదేశం విస్తృత స్థాయి సమావేశానికి గైర్హాజరైన వారిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాలకంటే ఇతర పనులు ఎక్కువయ్యాయా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. సమావేశానికి గైర్హాజరై 15 మంది ఎమ్మెల్యేలు విదేశాల్లో ఉండటంపై సీఎం సీరియస్ అయ్యారు. నియోజవర్గాల్లో ప్రజలకు దూరంగా ఉండటం సరికాదని హెచ్చరించారు. ఆహ్వానితుల్లో 56మంది గైర్హాజరయ్యారంటూ సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఉదయం ఎంత మంది వచ్చారు, సంతకాలు పెట్టి ఎంత మంది వెళ్లిపోయారు, సమావేశం చివరి వరకూ ఎంత మంది ఉన్నారో అందరి లెక్కలు తన వద్ద ఉన్నాయన్నారు. ప్రజలతో మమేకమైతేనే భవిష్యత్తు ఉంటుందని గట్టిగా చెప్పారు. తరచూ విదేశీ పర్యటనలు పెట్టుకునేవారు ఇక ఫారిన్‌లో ఉండటం మంచిదన్నారు.


మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో టీడీపీ అధినేత చంద్రబాబు మేనిఫెస్టో అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. అమలు చేసిన హామీలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలనే అంశంపై సీఎం దిశా నిర్దేశం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న ఎమ్మెల్యేలపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేలు తనకే సలహాలిస్తున్నారంటూ చంద్రబాబు ఛలోక్తులు వేశారు. పని చేయకుండా సలహలకే పరిమితమయ్యే ఎమ్మెల్యేలు భవిష్యత్‌లో నాయకులుగా ఉండలేరన్నారు. కొందరు ఎమ్మెల్యేలు నాన్ సీరియస్‌గా ఉన్నారంటూ చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశానికే రానివారు.. మీ నియోజకవర్గాల్లో ఏం పవి చేస్తారని టీడీపీ అధినేత ప్రశ్నించారు. సుపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ క్యాంపెయిన్ కారణంగా ప్రభుత్వ సమీక్షల నుంచి మంత్రులకు వెసులుబాటు ఉంటుందన్నారు. క్షేత్ర స్థాయిలో ఇంటింటికి ప్రచారం చేయాలంటూ సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.


Also Read:

యువ రచయిత సూరాడ ప్రసాద్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు..

నా శత్రువు పెద్దారెడ్డి మాత్రమే...

For More Telugu News

Updated Date - Jun 29 , 2025 | 08:23 PM