Share News

CM Chandrababu: ఆ ప్రాజెక్టుల్లో జల కళ.. సీఎం చంద్రబాబు రియాక్షన్

ABN , Publish Date - Aug 10 , 2025 | 07:50 PM

భారీ వర్షాలు, వరదలతో ఏపీలోని పలు నీటి ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. దాదాపుగా అన్ని ప్రాజెక్టులూ జల కళను సంతరించుకున్నాయి.

CM Chandrababu: ఆ ప్రాజెక్టుల్లో జల కళ.. సీఎం చంద్రబాబు రియాక్షన్
AP CM Chandrababu Naidu

అమరావతి, ఆగస్ట్ 10: భారీ వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్ లోని పలు నీటి ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. దాదాపుగా అన్ని ప్రాజెక్టులూ జలకళను సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తన ఎక్స్ ఖాతా వేదికగా ఆదివారం స్పందించారు. రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాల్లో 6 లక్షల ఎకరాలకు సాగు నీరందించే హంద్రీ-నీవా ప్రాజెక్టులో కృష్ణమ్మ పరవళ్లు చూసి తన మనసు పులకరిస్తోందన్నారు.


ఈ నీరు ప్రతి ప్రాజెక్టు నిండేలా.. ప్రతి చెరువుకు నీరందేలా.. చివరి భూములను సైతం తడిపేలా అవుతుందని పేర్కొన్నారు. అత్యధిక సామర్థ్యంతో హంద్రీ- నీవా కాల్వల్లోని నీటి ప్రవాహాలు రైతన్నల ఆశలను, ఆకాంక్షలను తీరుస్తున్నాయని ఆయన తెలిపారు. రికార్డు సమయంలో కాల్వల విస్తరణ చేపట్టిన కారణంగానే ఈ సీజన్‌ లో చివరి భూములకూ నీరందించాలనే తమ కల సాకారమవుతోందని చెప్పారు. రైతుల సంతోషం తన సంకల్పానికి మరింత బలాన్నిస్తోందన్నారు. అలాగే హంద్రీ-నీవా ప్రాజెక్టులో కృష్ణమ్మ పరవళ్లతో మనసు పులకరిస్తోందంటూ వీడియోను సీఎం చంద్రబాబు ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ నియోజకవర్గాన్ని కృష్ణాజిల్లాలోనే కొనసాగించండి

జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై చర్యలకు రంగం సిద్ధం..!

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Aug 10 , 2025 | 09:48 PM