Share News

CM Chandrababu: ప్రధాని మోదీ సారథ్యంలో దూసుకెళ్తున్న భారత్

ABN , Publish Date - May 25 , 2025 | 04:26 PM

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశం శనివారం న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ 2047 పై సీఎం చంద్రబాబు నాయుడు బ్లూ ప్రింట్‌ను ప్రదర్శించారు.

CM Chandrababu: ప్రధాని మోదీ సారథ్యంలో దూసుకెళ్తున్న భారత్
CM Chandrababu Naidu

అమరావతి, మే 25: దర్శనికుడు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 4.2 ట్రిలియన్ డాలర్లతో భారత్.. ప్రపంచంలో నాలుగో ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ఆంధ్రప్రదేశ్ ముఖమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తద్వారా జపాన్ ఆర్థిక వ్యవస్థను భారత్ దాటిందన్నారు. ఇక ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) నివేదికల ప్రకారం.. 2028 నాటికి జర్మనీ ఆర్థిక వ్యవస్థను భారత్ దాటుతుందని తెలిపారు.

దీంతో నాటికి భారత్ మూడో ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతుందని తెలిపారు. ఇలాంటి తరుణంలో అన్ని రాష్ట్రాలు వికసిత్ భారత 2047 లక్ష్యాల సాధనకు కృషి చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. దేశం ఆ వైపు పయనిస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ గ్రోత్ ఇంజన్‌లా స్వర్ణాంధ్ర 2047 సాధనకు కృషి చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం తన ఎక్స్ ఖాతా వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు.


మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశం శనివారం న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ 2047 పై సీఎం చంద్రబాబు నాయుడు బ్లూ ప్రింట్‌ను ప్రదర్శించారు. ఈ బ్లూ ప్రింట్‌పై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.

ఈ వార్తలు కూడా చదవండి..

ఎయిర్ హోస్టెస్ కావాలనుకుంటున్నారా ?

మావోయిస్ట్ అగ్రనేతల మృతదేహాల తరలింపునకు ఎస్పీ అడ్డంకులు

For National News And Telugu News

Updated Date - May 25 , 2025 | 05:00 PM