CM Chandrababu: నీట్ యూజీ టాపర్లకు అభినందనలు తెలిపిన సీఎం
ABN , Publish Date - Jun 15 , 2025 | 04:06 PM
ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబుతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లంచ్ మీటింగ్‌లో వీరిద్దరూ పలు అంశాలు చర్చించారు.
అమరావతి, జూన్ 15: నీట్ యూజీ -2025 పరీక్షల్లో ఉత్తీర్ణ సాధించిన వైద్య విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఈ పరీక్షల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చాలా మంచి ఫలితాలు సాధించారన్నారు. 18వ ర్యాంకు సాధించిన తెలంగాణకు చెందిన కాకర్ల జీవన్ సాయికుమార్‌కు ఆయన అభినందనలు తెలిపారు. అలాగే 19వ ర్యాంకు ఏపీకి చెందిన దర్బా కార్తీక్ రామ్ కైవసం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ మేరకు ఎక్స్ ఖాతా వేదికగా సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.
మరోవైపు ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబుతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లంచ్ మీటింగ్‌లో వీరిద్దరి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో పొగాకు రైతుల సమస్యలపై వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ఇక ఈ భేటీ అనంతరం గుంటూరుకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెళ్లారు. గుంటూరులోని పొగాకు బోర్డ్ కార్యాలయంలో బోర్డు అధికారులతోపాటు ఎన్‌ఐసీడీసీతో సమావేశమయ్యారు.
ఈ సందర్బంగా పొగాకు రైతుల సమస్యలు, పొగాకు కొనుగోళ్లు అంశంపై చర్చ జరిగింది. ఈ సమావేశం అనంతరం విజయవాడ చేరుకుని.. అక్కడి నుంచి ఆయన హైదరాబాద్ వెళ్లనున్నారు. ఆ తర్వాత తిరుమలకు వెళ్లనున్నారు కేంద్రమంత్రి. శ్రీవారిని సోమవారం ఉదయం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దర్శించుకోనున్నారు. ఆ తర్వాత ఢిల్లీకి పయనమవుతారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మరోసారి బంద్‌కు మావోయిస్టుల పిలుపు.. ఎందుకంటే..
మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం..
For Andhrapradesh News And Telugu News