CM Chandrababu Denounces Fake Propagand: ఫేక్‌ల పని పడతాం
ABN , Publish Date - Sep 04 , 2025 | 03:06 AM
వైసీపీ నాయకులు అన్ని విషయాల్లోనూ ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువుల కొరత.. రైతుల ఆందోళన అంటూ జరుగుతున్న దుష్ప్రచారంపై బుధవారం సచివాలయంలో సీఎం విలేకరుల సమావేశం నిర్వహించారు..
రైతుల ముసుగులో వైసీపీ రాజకీయం
ఎరువుల రవాణాను అడ్డుకుంటున్నారు
డ్రామాలు చేస్తే జైలుకు పంపుతాం
అన్నదాతలు జగన్ ట్రాప్‌లో పడొద్దు
సమృద్ధిగా ఎరువులు.. ఆందోళన వద్దు
94,892 టన్నుల యూరియా లభ్యత
మీడియా సమావేశంలో సీఎం స్పష్టీకరణ
అమరావతి, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నాయకులు అన్ని విషయాల్లోనూ ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువుల కొరత.. రైతుల ఆందోళన అంటూ జరుగుతున్న దుష్ప్రచారంపై బుధవారం సచివాలయంలో సీఎం విలేకరుల సమావేశం నిర్వహించారు. విషవృక్షం లాంటి వైసీపీ చేసే దుష్ప్రచారాల్లో రైతులు భాగంకావద్దని కోరారు. రాష్ట్రంలో సమృద్ధిగా ఎరువుల నిల్వలు ఉన్నాయని, ఆందోళన అవసరం లేదని తెలిపారు. ప్రస్తుతం 94,892 టన్నుల యూరియా అందుబాటులో ఉన్నదని, కేంద్రం మరో 53వేల టన్నులు కేటాయించిందని తెలిపారు. ‘‘ఫేక్ పార్టీ, నేరాలను నమ్ముకున్న పార్టీ విషపు విత్తనాలను చల్లుతోంది. కానీ, ఇది సీబీఎన్ ప్రభుత్వం. డ్రామాలు ఆడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఎరువులు, యూరియాపై దుష్ప్రచారం చేసేవారిని జైలుకు పంపుతాం.’’ అని హెచ్చరించారు. యూరియా విషయంలో కృష్ణా జిల్లాలో వైసీపీకి చెందిన యర్రా వాసు, రామ్మూర్తి, చీలి వెంకటేశ్వరరావు, ఈశ్వరరావు తదితరులు కుట్రపూరితంగా వ్యవహరించారని, ఎరువుల లారీని హైజాక్ చేసే ప్రయత్నం చేశారని తెలిపారు. ‘‘రాష్ట్రంలో కొందరు క్రిమినల్స్ ఎరువుల విషయంలో దుష్ప్రచారం చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో ఎంతెంత స్టాక్ ఉందో.. ఏయే దుకాణాల్లో ఎంత నిల్వలు ఉన్నాయనే వివరాలు ప్రభు త్వం దగ్గర ఉన్నాయి. తప్పుడు ప్రచారం చేసి, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే ఊరు కోం. ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయడానికి ప్రయత్నిస్తే సహించబోం. కఠినంగా వ్యవహరిస్తాం. రైతుల ముసుగులో రాజకీయం చేస్తే ఖబడ్దార్ అని హెచ్చరిస్తున్నాం. నేరాలు, ఘోరాలు చేసి వైసీపీ నేతలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కుప్పంలో నీరిస్తే నీళ్లు లేవని ప్రచారం చేశారు. పులివెందులకు మేం నీరిస్తే వైసీపీ వాళ్లు వెళ్లి తామే ఇచ్చినట్లుగా హారతులు ఇచ్చారు. స్టీల్‌ప్లాంట్‌కు రూ.12వేల కోట్ల కేంద్రం నిధులు ఇస్తే పేటీఎం బ్యాచ్ ద్వారా ప్రైవేటుపరం చేస్తున్నామని దుష్ప్రచారం చేశారు. ఉద్యోగుల వయోపరిమితి మీద ఏకంగా ఫేక్ జీవో తెచ్చి ఫేక్ ప్రచారం చేశారు. తప్పుడు పోస్టులు, తప్పుడు ప్రచారాలు చేసి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తే తాట తీస్తాం.’’ అని తీవ్రస్వరం వినిపించారు.
భ్రమల్లో ఉంటారు... భ్రమలు కల్పిస్తారు
అవాస్తవాలను కూడా వాస్తవాలని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నేతలపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. ‘‘హెరిటేజ్ ఔట్‌లెట్లు అనేవే లేవు. అయినా వాటి ద్వారా ఉల్లిపాయలు అమ్ముతున్నామని మాజీ సీఎం స్థాయి వ్యక్తి విష ప్రచారం చేస్తున్నారు. విచిత్రమైన వింత జీవుల్లా ప్రవర్తిస్తున్నారు. ఊహాగానాల్లో బతికేస్తున్నారు. ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారని వైసీపీ అనుకుంటోంది. వాళ్లను చూస్తుంటే జాలి వేస్తోంది. విలువల్లేని వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలే వస్తాయి. వాళ్లు దుష్ప్రచారం చేస్తుంటే మేం సరి చేస్తూ కూర్చోవాలా?’’ అని ఆయన ప్రశ్నించారు.
త్వరలో రైతులతో భేటీ
వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారంతో రైతులను రోడ్డునపడేస్తున్నారని సీఎం అన్నారు. వీరి రాజకీయ ఉచ్చులో పడొద్దని కోరారు. రైతులకు మంచి చేస్తుంటే వైసీపీ ఓర్వలేకపోతోందని ఆరోపిం చారు. ‘‘రైతులకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి ఎరువుల్ని తరలించాలని అధికారులను ఆదేశించాను. ఖరీఫ్ ప్రారంభ నిల్వతో కలిపి 6.65 లక్షల టన్నుల యూరియా సరఫరా చేశాం. గత పది రోజుల్లోనే 28 వేల టన్నులు అందించాం. రానున్న పదిరోజుల్లో మరో 30 వేల టన్నులు అందిస్తాం.’’ అని వివరించారు. అవసరం లేకపోయినా పురుగుమందులను అధికంగా వినియోగించడాన్ని రైతులు మానాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఆర్గానిక్ సాగుపై దృష్టిపెట్టాలని కోరారు. డ్రోన్ టెక్నాలజీతో ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించే రైతులకు సబ్సిడీలు ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని చంద్రబాబు తెలిపారు.
ప్రతిపక్ష హోదా మేం కాదు.. ప్రజలిస్తారు
జగన్ తీరుపై చంద్రబాబు ఫైర్
అసెంబ్లీకి వచ్చి ప్రజాసమస్యలను చర్చించమంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అంటున్నారంటూ జగన్‌పై చంద్రబాబు తీవ్రస్వరం వినిపించారు. ‘‘వీరికి అసలు బుద్ధుందా? ప్రజలు ఇచ్చిన సీట్లతోనే ప్రతిపక్ష హోదా వస్తుంది. అది ప్రజలు పార్టీకి ఇచ్చే హక్కు. ప్రతిపక్ష హోదాకు మీరు తగరనే 11 సీట్లు ఇచ్చారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలంటే 18 సీట్లు కావాలి. వైసీపీకి రాజ్యాంగంపై నమ్మకం లేదు. ఎన్నికల వ్యవస్థపై నమ్మకం లేదు. అందుకే ప్రతిపక్ష హోదా కావాలంటూ బ్లాక్‌మెయిల్ చేస్తోంది. ఓట్లేయలేదని ప్రజలపై కక్షతో వ్యవహరిస్తున్నారు. కోడికత్తి, గొడ్డలివేటు, గుండెపోటు, గులకరాయి డ్రామాలతోపాటు ఎరువులిస్తున్నా ఇవ్వడం లేదని ఫేక్ డ్రామాలు ఆడుతున్నారు.’’ అని చంద్రబాబు ఆగ్రహించారు.
తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. నువ్వొస్తానంటే.. నే రానిస్తానా..!
పౌరుషానికి ప్రతీక నందమూరి హరికృష్ణ..
Read Latest Andhra Pradesh News and National News