President Droupadi Murmu: తిరుమల చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ABN , Publish Date - Nov 20 , 2025 | 05:07 PM
తిరుచానూరు, తిరుమలలో రాష్ట్రపతి ముర్ము పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
తిరుమల, నవంబర్ 20: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ (గురువారం) మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర హోమ్ మంత్రి వంగలపూడి అనిత, టీటీడీ ఉన్నతాధికారులతోపాటు కూటమిలోని పార్టీల నేతలు ఆమెకు ఘనస్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా తిరుచానూరుకు రాష్ట్రపతి చేరుకున్నారు. తిరుచానూరులో కొలువు తీరిన శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత అమ్మవారి తీర్థ ప్రసాదాలను రాష్ట్రపతికి వేద పండితులు అందజేశారు.
ఇక రాష్ట్రపతి పర్యటన సందర్భంగా తిరుచానూరులో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. స్థానికుల రాకపోకలను నిలిపివేశారు. దాంతో స్థానికులు కొంత ఇబ్బంది పడ్డారు. ఇక తిరుచానూరు పర్యటన ముగించుకుని.. సాయంత్రం రోడ్డు మార్గం ద్వారా రాష్ట్రపతి తిరుమల చేరుకుంటారు. రాత్రికి పద్మావతి అతిథి గృహంలో ఆమె బస చేస్తారు. శుక్రవారం ఉదయం శ్రీవెంకటేశ్వర స్వామి వారిని రాష్ట్రపతి దర్శించుకోనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన నేపథ్యంలో తిరుమలలో సైతం పటిష్టమైన భద్రతాను ఏర్పాటు చేశారు. తిరుపతి పర్యటన ముగిసిన అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సుబ్బారెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..!
కుప్పం ప్రజలకు అండగా ఉంటాం: నారా భువనేశ్వరి
Read Latest AP News And Telugu News