Share News

TTD Laddu Adulterated Ghee Case: సుబ్బారెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..!

ABN , Publish Date - Nov 20 , 2025 | 03:41 PM

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై సిట్ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే టీటీడీలోని పలువురు ఉన్నతాధికారులను సిట్ విచారించింది. ఈ విచారణలో వెలుగు చూసిన అంశాల ఆధారంగా టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

TTD Laddu Adulterated Ghee Case: సుబ్బారెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..!

హైదరాబాద్, నవంబర్ 20: శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని సిట్ అధికారుల బృందం విచారిస్తోంది. గురువారం హైదరాబాద్‌లోని వైవీ సుబ్బారెడ్డి నివాసంలోనే ఆయన్ని సిట్ అధికారులు విచారిస్తున్నారు. భోజన విరామానికి గంట సమయం ఇచ్చి.. అనంతరం మళ్లీ విచారణను చేపట్టారు. ఈ కేసులో వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న, టీటీడీ మాజీ ఈవో ఏవీ ధర్మారెడ్డితోపాటు పలువురు ఉన్నతాధికారులను ఇప్పటికే సిట్ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. వారిచ్చిన స్టేట్‌మెంట్ల ఆధారంగా వైవీ సుబ్బారెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు.


అంతేకాదు.. గతంలో సదరు అధికారులు ఇచ్చిన స్టేట్‌మెంట్లతోపాటు పలు కీలక డాక్యుమెంట్లను సైతం వైవీ సుబ్బారెడ్డి విచారణ సందర్భంగా హైదరాబాద్‌కు సిట్ అధికారులు తీసుకు వచ్చారు. వీటిని ముందు పెట్టి.. వైవీ సుబ్బారెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు.


తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై సిట్ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే టీటీడీలోని పలువురు ఉన్నతాధికారులను సిట్ విచారించింది. ఈ విచారణలో వెలుగు చూసిన అంశాల ఆధారంగా టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు చెప్పిన స్టేట్‌మెంట్లతోపాటు పలు డాక్యుమెంట్ల ఆధారంగా వైవీ సుబ్బారెడ్డికి సిట్ అధికారులు ప్రశ్నలు వేస్తున్నారు. ఈ విచారణలో వైవీ సుబ్బారెడ్డికి సంధించిన పలు ప్రశ్నలపై మౌనం వహిస్తే.. ఈ డాక్యుమెంట్లతోపాటుసేట్‌మెంట్లను ఆయన ఎదుట ఉంచేందుకు సిట్ అధికారులు పక్కా వ్యూహాంతో విచారిస్తున్నట్లు తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

కుప్పం ప్రజలకు అండగా ఉంటాం: నారా భువనేశ్వరి

ఆపరేషన్ సంభవ్ కొనసాగుతుంది.. ఏపీ డీజీపీ స్పష్టం

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 20 , 2025 | 04:39 PM