Tirumala: శ్రీవారి ఆలయం పై విమానం.. భక్తుల ఆగ్రహం
ABN , Publish Date - Feb 20 , 2025 | 10:51 AM
Tirumala Temple: తిరుమల శ్రీవారం ఆలయం గోపురంపై నుంచి మరోసారి విమానం చక్కర్లు కొట్టింది. ఆగమ నిబంధనలకు విరుద్ధంగా నిత్యం శ్రీవారి ఆలయం పై విమానాలు వెళ్తుండడం పట్ల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తిరుమల, ఫిబ్రవరి 20: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారి ఆలయం పై నుంచి మరోసారి విమానం వెళ్లడం తీవ్ర కలకలం రేపుతోంది. గత కొంత కాలంగా తరుచుగా శ్రీవారి ఆలయం పై నుంచి విమనాలు వెళ్తుండటం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈరోజు మాత్రం ఆలయంపై తక్కువ ఎత్తులో విమానం వెళ్లింది. ఆగమ నిబంధనలకు విరుద్ధంగా నిత్యం శ్రీవారి ఆలయం పై విమానాలు వెళ్తుండడం పట్ల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంపై విమానాల రాకపోకలు నిత్యం పరిపాటిగా మారిపోయాయి. కొద్దిరోజులుగా తిరుమల కొండపై ఆలయానికి సమీపంలో విమానాలు తిరుగుతున్నాయి. వీటిని చూసిన భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈరోజు కూడా ఓ విమానం శ్రీవారి ఆలయం గోపురం మీదుగా వెళ్లింది. ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయంపై ఎటుంటి రాకపోకలు సాగించకూడదు. అయితే ఈ విధంగా తరచూ శ్రీవారి ఆలయంపై నుంచి విమానాలు వెళ్లడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై టీటీడీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ విమానయాన శాఖ అధికారులు మాత్రం పట్టించుకోని పరిస్థితి. టీడీపీ అభ్యంతరం తెలుపుతున్నా, భక్తులు ఆందోళన చేస్తున్నప్పటికీ తిరుమల ఆలయంపై నుంచి విమానాల రాకపోకలు నిత్యకృత్యంగా మారిపోయాయి.
తిరుమల గోపురంపై నుంచి విమానాలు వెళ్లడంపై టీటీడీ ఇప్పటికే పలుమార్లు కేంద్రవిమానాయన శాఖకు విజ్ఞప్తి చేసింది. కనీసం తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలో కాకుండా తిరుమల గగనతలంలో ఇతర ప్రదేశాల నుంచి విమానాల రాకపోకలు సాగించాలన్న టీటీడీ వినతులను విమానాయన శాఖ పట్టించుకన్న దాఖలాలు లేవు.
కొద్దిరోజుల క్రితం తిరుమలకు వచ్చిన హోంమంత్రి అనిత కూడా ఈ అంశంపై స్పందించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ అంశం వచ్చిందని.. దీనిపై దర్యాప్తుకు ఆదేశించినట్లు తెలిపారు. నివేదికలు వచ్చిన వెంటనే కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించి శ్రీవారి ఆలయం పైనుంచి విమానాల రాకపోకలు జరుగకుండా చూసుకుంటామని హోంమంత్రి అనిత చెప్పారు.
ఇవి కూడా చదవండి...
Robbery: హైటెక్ చోరీ.. ఖంగుతిన్న పోలీసులు
Read Latest AP News And Telugu News