Share News

TTD: శ్రీవారి అన్నప్రసాదంలో మసాలా వడ

ABN , Publish Date - Jan 21 , 2025 | 12:52 AM

శ్రీవారి అన్నప్రసాదాల మెనూలో టీటీడీ మసాలా వడను చేర్చింది.

TTD: శ్రీవారి అన్నప్రసాదంలో మసాలా వడ
భక్తులకు మసాలా వడలను వడ్డిస్తున్న సిబ్బంది

తిరుమల, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి అన్నప్రసాదాల మెనూలో టీటీడీ మసాలా వడను చేర్చింది. భక్తులకు కొన్నేళ్లుగా అన్నంతో పాటు కర్రీ, కొబ్బరి చట్నీ, చక్కెర పొంగలి, సాంబారు, రసం, మజ్జిగ వడ్డిస్తున్నారు. అన్నదానం మెనూలో మరో పదార్థం చేర్చాలని గతేడాది నవంబరు 18న టీటీడీ ధర్మకర్తల మండలి తీర్మానించింది. ఈక్రమంలో సోమవారం మధ్యాహ్నం ప్రయోగాత్మకంగా ఉల్లి,వెల్లుల్లి లేకుండా దాదాపు 5వేల వడలను తయారు చేసి భక్తులకు వడ్డించారు. దీనిపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేయడంతో మరో నాలుగు రోజులపాటు వడల తయారీని పెంచి వడ్డించనున్నారు. రథసప్తమి నాటికి రెండుపూటలా అందించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. మసాలా వడ మాత్రమే కాకుండా ఆ స్థానంలో మరేదైనా పెట్టవచ్చా అనే అంశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.

Updated Date - Jan 21 , 2025 | 12:52 AM