Leopard At SVU: ఎస్వీయూలో మరోసారి చిరుత కలకలం
ABN , Publish Date - Oct 11 , 2025 | 11:38 AM
చిరుతలను పట్టేందుకు అటవీ శాఖ అధికారులు ఇప్పటికే ఐదు బోన్లు ఏర్పాటు చేశారు. రాత్రి పూట విద్యార్థులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తిరుపతి, అక్టోబర్ 11: తిరుపతిలో ఎస్వీ యూనివర్శిటీలో మరోసారి చిరుత కలకలం రేగింది. గత రాత్రి ఎంప్లాయిస్ క్వార్టర్స్ సమీపంలోకి చిరుత వచ్చింది. చిరుత సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. వెటర్నరీ, వేదిక్, ఎస్వీ యునివర్సిటీలో చిరుతలను పట్టేందుకు అటవీ శాఖ అధికారులు ఇప్పటికే ఐదు బోన్లు ఏర్పాటు చేశారు. రాత్రి పూట విద్యార్థులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు ఎవరూ కూడా రాత్రిపూట బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
గత కొన్ని నెలలుగా ఎస్వీయూలో చిరుతలు సంచరిస్తుండటం సంచలనం రేపుతోంది. ఈఏడాది జనవరిలో ఎస్వీయూలోని హెచ్ బ్లాక్ వసతి గృహం, ఎస్వీయు క్వార్టర్స్ దగ్గర చిరుత పులి కనిపిచింది. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు హడలిపోయారు. చిరుతను బంధించేందుకు అటవీ శాఖ అధికారులు బోన్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే బోనులో చిక్కకుండా అధికారులను చిరుత ముప్పుతిప్పలకు గురిచేసింది. చివరకు రెండు నెలల క్రితం చిరుత బోనుకు చిక్కడంతో వెంటనే ఎస్వీ జూపార్క్‌కు తరలించారు. ఇప్పుడు తాజాగా గత రాత్రి మరో చిరుత ఎస్వీయూలో సంచరిస్తూ సీసీ టీవీ రికార్డులో చిక్కింది. దీంతో యూనివర్శీటీలో తరచూ చిరుత సంచారంపై విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ఇవి కూడా చదవండి...
మచిలీపట్నం పీఎస్ ఘటనపై ఎస్పీ సీరియస్.. పేర్నినానిపై కేసు నమోదు
Read Latest AP News And Telugu News