Share News

YCP: వైసీపీలో గాలి జగదీష్‌ చేరిక వాయిదా

ABN , Publish Date - Feb 12 , 2025 | 01:07 AM

నగరి నియోజవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యంగా వైసీపీలో కలకలం రేగింది. మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు చిన్న కుమారుడు గాలి జగదీష్‌ నేడు వైసీపీలో చేరాల్సి వుండగా హఠాత్తుగా చేరిక వాయిదా పడింది.

YCP: వైసీపీలో గాలి జగదీష్‌ చేరిక వాయిదా
గాలి జగదీష్‌

నగరి/పుత్తూరు అర్బన్‌, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): నగరి నియోజవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యంగా వైసీపీలో కలకలం రేగింది. మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు చిన్న కుమారుడు గాలి జగదీష్‌ నేడు వైసీపీలో చేరాల్సి వుండగా హఠాత్తుగా చేరిక వాయిదా పడింది.ఏ రాజకీయ పార్టీలోనూ లేకుండా అడపాదడపా నియోజకవర్గంలో పర్యటించి వెళుతు న్న గాలి జగదీష్‌ బుధవారం తాడేపల్లిలో మాజీ సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.మంగళవారం ఉదయాన్నే అనుచరు లతో కలసి విజయవాడ బయల్దేరి వెళ్ళారు. అయితే ఏమి జరిగిందో తెలియదు కానీ బుధవారం పార్టీలో చేరే కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నట్టు తెలిసింది. ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు, ఆ మేరకు విజయవాడ బయల్దేరి వెళ్ళినట్టు, తీరా వెళ్ళాక చేరిక వాయిదా వేసుకున్నట్టు తెలియడంతో నగరి నియోజకవర్గ రాజకీయాల్లో దీనిపై జోరుగా చర్చ నడుస్తోంది. మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు మరణం తర్వాత కుటుంబంలో ఆయన కుమారులు గాలి భానుప్రకాష్‌, గాలి జగదీష్‌ ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారు.రాజకీయంగా ఎడమొహం పెడ మొహంగా వుంటున్నారు. 2019 ఎన్నికల్లో నగరి నియోజకవర్గంలో గాలి భానుప్రకాష్‌ గెలుపునకు సోదరుడు సహకరించలేదన్న ప్రచారం జరిగింది. అలాగే 2024 ఎన్నికల్లోనూ అదే పరిస్థితి కనిపించింది. అప్పట్లోనే వైసీపీలో చేరేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదని తెలిసింది. గత ఎన్నికల నాటికి మాజీ మంత్రి రోజా రాజకీయంగా బలంగా వుండ డం, అధిష్ఠానంలో పలుకుబడి కలిగివుండడంతో గాలి జగదీష్‌కు ప్రాధాన్యత లభించే పరిస్థితి కనిపించలేదు. అయితే గతేడాది ఎన్నికల తర్వాత పరిస్థితి మారింది. రోజా ఓడిపోవడంతో పాటు నియోజకవర్గానికి దూర మైనట్టుగా కనిపిస్తోంది.దానికితోడు వైసీపీలోనే ఆమె ను వ్యతిరేకించే వర్గాలు బలంగా వున్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకుని సన్నిహితులు కొందరు జగ దీష్‌ను వైసీపీలో చేర్చేందుకు తెర వెనుక సన్నాహాలు చేసినట్టు సమాచారం.


బుధవారం తాడేపల్లిలో జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకు న్నారు. ముందస్తుగా జగదీష్‌ నియోజకవర్గవ్యాప్తంగా సన్నిహితులు, అనుచరులతో పాటు మాజీ మంత్రి రోజా వ్యతిరేక వర్గాన్ని కూడా కలసి తన చేరికకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరినట్టు సమాచారం. ఆ మేరకు ఏర్పాట్లు చేసుకుని మంగళవారం మధ్యాహ్నానికి ఆయన విజయవాడ చేరారని, గంటల వ్యవధిలో ఏమి జరిగిందో గానీ బుధవారం చేరిక కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటున్నట్టు ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది. దీంతో నియోజకవర్గంలో రకరకాల ఊహాగానాలు ప్రచారమవుతున్నాయి. కొందరు మాజీ మంత్రి రోజా ఆయన చేరికను అడ్డుకు న్నారని చెబుతుండగా మరికొందరు చేరిన తర్వాత పార్టీలో తగిన ప్రాధాన్యత వుం టుందో వుండదోనన్న అనుమానం జగదీష్‌ వర్గీయులకు రావడంతో వాయిదా వేసుకున్నారని చెబుతున్నారు. ఆయన సన్నిహితులు మాత్రం బుధ వారం జగదీష్‌ మాజీ సీఎం జగన్‌ను కలుస్తారని, ఆ తర్వాతే పార్టీలో చేరికపై స్పష్టత వస్తుందని చెబుతు న్నారు.మొత్తం మీద ఈ వ్యవహారం నియోజకవర్గంలో అలజడి సృష్టి స్తోంది.

Updated Date - Feb 12 , 2025 | 01:07 AM