Bhumana Karunakar Reddy: అవినీతిలో అనకొండ.. అధికారిణిపై భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Aug 26 , 2025 | 12:37 PM
ఓ అధికారిణిపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యాలు చేశారు. ఆమె అవినీతిలో అనకొండ లాంటి అధికారి అని తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో ఆమె మంత్రులను సైతం..
తిరుపతి: వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో అవినీతికి పాల్పడి అరెస్టు అయిన ఓ అధికారిణిపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యాలు చేశారు. ఆమె అవినీతిలో అనకొండ లాంటి అధికారి అని తీవ్ర విమర్శలు గుప్పించారు. తిరుపతిలో టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై మంత్రి నారాయణ చేసిన కామెంట్స్ నేపథ్యంలో భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. ఓ వీడియోను విడుదల చేశారు. సదరు అవినీతి అధికారిణి గతంలో మంత్రులను సైతం పూచికపుల్లలా చూసిందన్నారు. కనీసం తన శాఖకు సంబంధించిన మంత్రులను కూడా లెక్క చేయదంటూ ఆమె తీరును తప్పుపట్టారు. ఆమెకు డబ్బులు సంపాదించడమే తప్ప ఎలాంటి నైతిక విలువలు లేని అధికారిని అని, తాటకిలాగా కింది స్థాయి అధికారుల పట్ల వ్యవహరించారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తిరుపతిలో తాము రోడ్లు వేస్తున్న సమయంలో అ అధికారిణి టీడీఆర్ బాండ్ల ద్వారా వందల కోట్లు కొట్టేయాలనే ప్లాన్ వేస్తే దానిని తాము అడ్డుకున్నామని.. ఇది తట్టుకోలేక ఆమె నెల్లూరు జిల్లా నేతలకు తాము రెండు వేల కోట్లు దోచుకున్నామంటూ ప్రచారం చేయించిందన్నారు. ఆ అధికారిణి గత 35 ఏళ్లుగా ఎక్కడ పనిచేసినా అవినీతికి పాల్పడుతూ వందల కోట్లు దోచుకుందని ఆరోపించారు. మీ అవినీతి గురించి మాకు బాగా తెలుసు అని అత్యున్నత న్యాయస్థానం సైతం ఆమె గురించి వెటకారంగా చెప్పిందన్నారు. రోజూ ఆమె ధరించే చీర లక్షన్నర రూపాయలు అని.. 50 లక్షల రూపాయలకంటే విలువైన విగ్గులు ఆవిడకు 11 ఉన్నాయి అని.. ఒక్కో రోజు ఒక్కో విగ్గుతో దర్శనమిస్తుంటారంటూ షాకింగ్ కామెంట్స్ చూశారు భూమన.
Also Read:
ఎకో ఫ్రెండ్లీ గణేష్ తయారీలో.. ఎన్టీఆర్ జిల్లా వరల్డ్ రికార్డ్
ట్రంప్ చేతిపై మళ్లీ ఎర్రని మచ్చ.. అసలేం జరుగుతోంది
ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు..