Share News

Telangana Assembly Session 2025: ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు..

ABN , Publish Date - Aug 26 , 2025 | 11:47 AM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అంతకు ముందు రోజు అంటే 29వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల..

Telangana Assembly Session 2025: ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు..
Telangana Assembly sessions 2025

హైదరాబాద్, ఆగస్టు 26: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అంతకు ముందు రోజు అంటే 29వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం కమీషన్‌ నివేదికపై చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల్లోనే సభ్యులందరికీ కమిషన్ రిపోర్ట్‌ను ప్రభుత్వం అందించనుంది. కాగా, అసెంబ్లీ సమావేశాలు 5 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Also Read:

జగన్‌కు హైకోర్టులో ఎదురు దెబ్బ

ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు..

For More Telangana News and Telugu News..

Updated Date - Aug 26 , 2025 | 11:47 AM