Tirumala Brahmotsavam: అంకురార్పణకు అంతా సిద్ధం..
ABN , Publish Date - Sep 23 , 2025 | 09:18 AM
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తొలి ఘట్టమైన అంకుర్పాణకు సర్వం సిద్ధమైంది. తొమ్మిదిరోజుల పాటు జరిగే ఉత్సవాలు విజయవంతం కావాలంటూ ఆకాంక్షిస్తూ మంగళవారం నిర్వహించనున్నారు.
తిరుమల, సెప్టెంబరు22(ఆంధ్రజ్యోతి): తిరుమల (Tirumala) శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తొలి ఘట్టమైన అంకుర్పాణకు సర్వం సిద్ధమైంది. తొమ్మిదిరోజుల పాటు జరిగే ఉత్సవాలు విజయవంతం కావాలంటూ ఆకాంక్షిస్తూ మంగళవారం నిర్వహించనున్నారు. వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం మంగళవారం రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య నిర్వహించే అంకురార్పణతో బ్రహ్మోత్సవాలకు బీజం పడనుంది. ఆలయంలోని రణం కూడా విశేషంగా నిర్వహిస్తారు. అర్చకులకు శ్రీవారే విధులు కేటాయిస్తున్నట్టుగా భావించి ఈ తొమ్మిదిరోజుల పాటు ఎవరు ఏ విధులు నిర్వహించాలో ఈ కార్యక్రమం ద్వారా నిర్ణయిస్తారు. దీనికి సంబంధించి సోమవారం సాయం త్రానికే ప్రణాళిక సిద్ధం చేశారు.
ముస్తాబైన కొండ..
యాగశాలలో అంకురార్పణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. నవధాన్యాలను మొలకెత్తించి ఈ భూమండలమంతా పాడి పంటలతో, పశుపక్ష్యాదులతో సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తారు. శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడు విష్వక్సేనులవారిని ఆలయ నాలుగు మాడవీధుల్లో తొలివాహనంగా ఊరేగిస్తారు. జగద్రక్షకుడైన శ్రీవా రికి నిర్వహించే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిం చేందుకు విష్వక్సేనులవారు ఈవిధంగా మాడవీ ధుల్లో ఊరేగుతారని ప్రాశస్త్యం. మరోవైపు రుత్వికవ బ్రహ్మోత్సవ వైభవం మంగళవారం నుంచి మొదలుకానున్న నేపథ్యంలో తిరుమల క్షేతాన్ని విద్యుత్ అలంకరణలతో ముస్తాబు చేశారు. శ్రీవారి ఆనందనిలయం నుంచి మహద్వారం వరకు, గోపురం, ప్రాకారం, ఆలయ పరిసర భవనాలు, ముఖ్య కూడళ్లు, రహదారులు, పార్కుల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణను సోమవారం రాత్రి మరోసారి పరీక్షించి లోటుపాట్లను సరి చేశారు.
ఇవి కూడా చదవండి
ఈ రెండింటిలో ఏది మంచిది.. వాకింగ్..? సైక్లింగ్..?
బీజేపీ నేత కారులో భారీ కొండ చిలువ..