Share News

Chief Whip GV Anjaneyulu: పరామర్శ పేరుతో.. మరో రెండు ప్రాణాలను బలి తీసుకున్నాడు..

ABN , Publish Date - Jun 18 , 2025 | 09:44 PM

శవ రాజకీయాల పిచ్చితో జగన్ మనుషుల ప్రాణాలు హరిస్తున్నాడని ప్రభుత్వ చీఫ్‌ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం జగన్‌పై ఫైర్ అయ్యారు. రాజకీయ పరామర్శ యాత్ర చేపట్టి.. జగన్ మరో రెండు ప్రాణాలను బలితీసుకున్నాడన్నారు.

Chief Whip GV Anjaneyulu: పరామర్శ పేరుతో.. మరో రెండు ప్రాణాలను బలి తీసుకున్నాడు..

అమరావతి: శవ రాజకీయాల పిచ్చితో జగన్ మనుషుల ప్రాణాలు హరిస్తున్నాడని ప్రభుత్వ చీఫ్‌ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం జగన్‌పై ఫైర్ అయ్యారు. రాజకీయ పరామర్శ యాత్ర చేపట్టి.. జగన్ మరో రెండు ప్రాణాలను బలితీసుకున్నాడన్నారు. చంపుతాం, నరుకుతామంటూ ప్రజల్ని హెచ్చరిస్తున్న ఉన్మాదులను వదులుతున్నాడంటూ దుయ్యబట్టారు. అంబటి రాంబాబు ఆంబోతులాగా బారికేడ్లను తోసేసి.. పోలీసులపై ఎగబడటం ఏంటని ప్రశ్నించారు. సత్తెనపల్లిలో వైసీపీ అల్లరిమూకల తీరుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడ్డారని చెప్పారు.


జగన్ పరామర్శలకు వెళ్లారో.. లేక దౌర్జన్యాలు, దందాలకు వెళ్లారో అర్థం కావడం లేదని చీఫ్‌ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. కులాల పేరిట రాజకీయం చేయడంలో జగన్‌ డిగ్రీ చేశాడని తెలిపారు. జగన్ కమ్మ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టాలని జగన్ చూస్తున్నారని ఆరోపించారు. జగన్‌ చెబితేనే వైకాపాలోని కమ్మ నేతలు నోటికి అడ్డూ అదుపులేకుండా మాట్లాడుతున్నారని చెప్పారు. జగన్ రెడ్డికి కొత్తగా కమ్మ సామాజిక వర్గం నేతలపై ప్రేమ పుట్టుకు వచ్చిందన్నారు. నిమ్మగడ్డ రమేష్, ఏబీ వెంకటేశ్వరరావుపై వేధింపులను జగన్ మరిచిపోయావా.. అంటూ ప్రశ్నించారు. అమరావతిని కమ్మరావతి అని సాక్షి, సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారని, జగన్ కాకమ్మ కబుర్లు వినే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు, కమ్మ సామాజికవర్గం లేదంటూ ఆయన పేర్కొన్నారు.


Also Read:

ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నారు: నారా లోకేష్

తాట తీస్తా.. అంబటి రాంబాబుకు డీఎస్పీ సీరియస్ వార్నింగ్

For More Telugu News

Updated Date - Jun 18 , 2025 | 09:45 PM