CM Chandrababu : బీసీలను హత్యచేసిన వారికి శిక్ష పడాలి
ABN , Publish Date - Feb 15 , 2025 | 04:07 AM
వైసీపీ హయాంలో బీసీలను ఊచకోత కోశారని, వారి హత్యలపైనా విచారణ వేగవంతం చేసి నిందితులను కఠినంగా శిక్ష పడేలా అవసరమైన చర్యలు....

విచారణ వేగవంతం చేయండి
సబ్‌కమిటీ నివేదిక రాగానే బీసీ రక్షణ చట్టం: చంద్రబాబు
చంద్రబాబు ఆదేశాలు
Amaravati : వైసీపీ హయాంలో బీసీలను ఊచకోత కోశారని, వారి హత్యలపైనా విచారణ వేగవంతం చేసి నిందితులను కఠినంగా శిక్ష పడేలా అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ అంశం మేనిఫెస్టోలో కూడా పొందుపరిచామని, అవసరమైతే ప్రత్యేక కమిషన్‌ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. బీసీ రక్షణ చట్టాన్ని సబ్‌కమిటీ నివేదిక రాగానే అమల్లోకి తెస్తామన్నారు. రాష్ట్రంలో 2014-19 మధ్య నాటి టీడీపీ ప్రభుత్వం జిల్లా కేంద్రాల్లో 13 కాపు భవనాలను మంజూరుచేసింది. అందులో 5 భవనాల నిర్మాణాలను ప్రారంభించగా, గత ప్రభుత్వం నిలిపేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిర్మాణాలను పూర్తి చేసేందుకు నిధులు విడుదల చేసింది. అవి త్వరలోనే వినియోగంలోకి రానున్నాయని అధికారులు వివరించారు. నిర్మాణంలో ఉన్న 42 కాపు కమ్యూనిటీ హాళ్లు కూడా వేగంగా పూర్తి చేయాలని చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఈ సమీక్షలో బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత, అధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
CRDA: రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లు
Srinivas Verma: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి