Breaking News: చీరాల బీచ్‌లో విషాదం.. సముద్ర స్నానం చేస్తూ ఐదుగురు గల్లంతు..
ABN , Publish Date - Oct 12 , 2025 | 07:24 PM
చీరాల మండలం వాడరేవులో విషాదం చోటు చేసుకుంది. ఐదుగురు విద్యార్థులు సముద్ర స్నానం కోసం వాడరేవు బీచ్‌కు వెళ్లి గల్లంతయ్యారు.
బాపట్ల జిల్లా: చీరాల మండలం వాడరేవులో విషాదం చోటు చేసుకుంది. ఐదుగురు విద్యార్థులు సముద్ర స్నానం కోసం వాడరేవు బీచ్‌కు వెళ్లి గల్లంతయ్యారు. నీటిలో మునిగి సముద్రంలోకి కొట్టుకుపోయారు. కొద్దిసేపటికి ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మరో ఇద్దరు విద్యార్థుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
సెలవు రోజులు కావడంతో బీచ్‌లో సరదాగా గడిపేందుకు అమరావతిలోని విట్ యూనివర్సిటికి చెందిన కొందరు విద్యార్థులు వాడరేవు బీచ్‌కు వెళ్లారు. వారిలో సాకేత్, మణిదీప్, సాత్విక్, సోమేష్, గౌతమ్ అలల తాకిడికి సముద్రంలోకి కొట్టుకుపోయారు. దీంతో ఆ ప్రాంతానికి చెందిన మత్స్యకారులు, గజ ఈతగాళ్లు వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
గల్లంతైన కాసేపటికి సాకేత్, మణిదీప్, సాత్విక్‌ల మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. సోమేష్, గౌతమ్‌ల ఆచూకీ ఇప్పటివరకూ లభ్యం కాలేదు. దీంతో ఈ ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ స్కాంలని బయటపెడతాం.. మంత్రి లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్
యువత కలలు సాకారం చేసేందుకు కృషి చేస్తాం: పవన్ కల్యాణ్
For More AP News And Telugu News