వైసీపీ తీరు దారుణం: విష్ణుకుమార్‌రాజు
ABN , Publish Date - Feb 25 , 2025 | 05:18 AM
సీపీ సభ్యులు ప్రవర్తించిన తీరు దారుణంగా ఉందని బీజేపీ శాసన సభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు అన్నారు. గవర్నర్ ప్రసంగిస్తున్నప్పుడు పేపర్లు చించి, స్పీకర్, మండలి చైర్మన్‌పై విసిరేయడం బాధాకరం.
అమరావతి, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీలో తొలి రోజు వైసీపీ సభ్యులు ప్రవర్తించిన తీరు దారుణంగా ఉందని బీజేపీ శాసన సభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు అన్నారు. గవర్నర్ ప్రసంగిస్తున్నప్పుడు పేపర్లు చించి, స్పీకర్, మండలి చైర్మన్‌పై విసిరేయడం బాధాకరం. బడ్జెట్ ప్రసంగాన్ని చింపేసి విసరడం ద్వారా గవర్నర్‌నూ, సభాపతిని మాత్రమే కాదు... తాను నియమించుకున్న మండలి చైర్మన్ మోషేన్ రాజును కూడా జగన్ అవమానించారు. వైసీపీ సభ్యులకు కనీసం సభా మర్యాదలు, సంప్రదాయాలు తెలియవా? జగన్ ట్రాప్ నుంచి వైసీపీ నేతలు బయటకు రావాలి’ అని విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలపై చర్చించే దమ్ము, బాధ్యత జగన్‌కు లేదని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని జగన్ ఖూనీ చేస్తున్నారని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు మండిపడ్డారు.