Share News

Constituency Delimitation: నియోజకవర్గాల పునర్విభజన జరగాలి

ABN , Publish Date - Aug 07 , 2025 | 04:51 AM

2027 కల్లా నియోజకవర్గాల పునర్విభజన చట్టం తీసుకురావడంతో పాటు అది అమలు జరగాలి. విభజన

Constituency Delimitation: నియోజకవర్గాల పునర్విభజన జరగాలి

  • విభజన చట్టంలో కూడా అదే ఉంది.. 225 సీట్లు అవ్వొచ్చు: మాధవ్‌

బాపట్ల, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): ‘2027 కల్లా నియోజకవర్గాల పునర్విభజన చట్టం తీసుకురావడంతో పాటు అది అమలు జరగాలి. విభజన చట్టంలో కూడా ఆ హామీ ఉంది. దాని విధివిధానాలు రావాల్సి ఉంది.. 225 సీట్లు వరకు పెరిగే అవకాశం ఉంది. అలా జరుగుతుందని గతంలో వాగ్దానం ఇచ్చి ఉన్నాం. అదే విధంగా జరుగుతుందనేది నా అభిప్రాయం’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా బుధవారం బాపట్లకు వచ్చిన ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన స్పందించారు. ‘ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుతం ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్న మాట వాస్తవమే. కానీ కేంద్రం ఉదారంగా నిధులు విడుదల చేయాలంటే కొన్ని నిబంధనలు పాటించాల్సిందే. అయినప్పటికీ రాజధాని నిర్మాణం శరవేగంగా జరిగేలా కేంద్రం అన్ని విధాల సహకరిస్తుంది. అదేవిధంగా రూ.లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయి. ఈ విషయంలో సీఎం చంద్రబాబు కృషితో పాటు, మంత్రి లోకేశ్‌ చొరవ కూడా అభినందనీయం. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆచార్య ఎన్జీరంగా యూనివర్సిటీ ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో రాజకీయ పార్టీలు తగు రీతిలో స్పందించలేదు. వారి సమస్య పరిష్కారంలో కేంద్రం కృషి ఎంతో ఉంది. బర్లీ పొగాకు రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతా’ అని మాధవ్‌ అన్నారు.


వెనక్కి తీసుకెళ్లమంటున్నారు...కనీస వసతులు లేవు

బాపట్ల శివారులో ఉన్న బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన అధ్యక్షుడు మాధవ్‌ రైతులతో మాట్లాడారు. తీసుకొచ్చిన పొగాకు బేళ్లను గ్రేడింగ్‌ పేరుతో వెనక్కి తీసుకెళ్లమంటున్నారని రైతులు ఆయన ముందు వాపోయారు. కొనుగోలు కేంద్రంలో రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తుందని, ఇక్కడ కనీసం మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేదని రైతాంగం వివరించింది. సెల్‌కు వచ్చే మెసేజ్‌లు మాత్రం 30 క్వింటాళ్లు అని వస్తుండగా 20 క్వింటాళ్లే కొంటున్నారని రైతులు తెలిపారు. అక్కడ నుంచే వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడితో పాటు పొగాకు బోర్డు చైర్మన్‌ యశ్వంత్‌ను మాధవ్‌ ఫోన్‌లో సంప్రదించే ప్రయత్నం చేశారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తానని రైతులకు ఆయన హామీ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఒక పార్టీని టార్గెట్ చేస్తారా.. ఎంపీపై సుప్రీం అసహనం, రూ.10 లక్షల జరిమానా

ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు

For AndhraPradesh News And Telugu News

Updated Date - Aug 07 , 2025 | 04:51 AM