Share News

Thunderstorm Warnings For AP : ఏపీకి పిడుగుపాటు హెచ్చరికలు

ABN , Publish Date - Sep 22 , 2025 | 04:00 PM

ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. రాగల మూడు గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Thunderstorm Warnings For AP :  ఏపీకి పిడుగుపాటు హెచ్చరికలు
Lightning Warning For AP

ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది. రాగల మూడు గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది:

🔴రెడ్ అలెర్ట్

రాగల మూడు గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

🟠ఆరెంజ్ అలెర్ట్

అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు పడతాయని పేర్కొంది. దీనికి సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది.

🟡 ఎల్లో అలెర్ట్

విశాఖ, ఎన్టీఆర్, ఏలూరు, తిరుపతి, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. హోర్డింగ్స్, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు దగ్గర నిలబడరాదని ప్రజలకు సూచించింది. రానున్న మూడు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆ మార్పులతో ముందుగానే దసరా: బీజేపీ

ఎన్టీటీపీఎస్ కాలుష్యంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 22 , 2025 | 04:44 PM