Minister Narayana: వేల ఎకరాలు ఇచ్చేందుకు అంగీకరించిన రైతులు
ABN , Publish Date - Jun 02 , 2025 | 07:00 PM
సోమవారం అమరావతిలో 48వ సీఆర్‌డీఏ సమావేశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పి. నారాయణ వివరించారు.
అమరావతి, జూన్ 02: రాజధాని అమరావతిలో ఎయిర్‌పోర్ట్ సహా స్మార్ట్ ఇండస్ట్రీస్, అంతర్జాతీయ క్రీడా నగరం కోసం 34 వేల ఎకరాల భూ సమీకరణ సరిపోదని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. ప్రజాభిప్రాయంతోనే భూ సమీకరణ నిర్ణయం తీసుకోవాలనుకున్నామని పేర్కొన్నారు. పెదకూరపాడు పరిధిలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపామన్నారు. 24 వేల ఎకరాలు ఇచ్చేందుకు రైతులు అంగీకారం తెలిపారని ఆయన వివరించారు. ఇప్పటి వరకు భూ సమీకరణ నిబంధనలు 217 చ.కి.మీ వరకే ఉందని చెప్పారు.
సోమవారం అమరావతిలో 48వ సీఆర్‌డీఏ సమావేశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం అనంతరం మంత్రి పి. నారాయణ విలేకర్లతో మాట్లాడుతూ.. భూ సమీకరణ నిబంధనల పరిధి పెంచేందుకు సీఆర్డీఏ నిర్ణయం తీసుకుందని తెలిపారు. కొత్తగా సేకరించే 40 వేల ఎకరాలు అభివృద్ధి చేయాలంటే.. నిధుల సమీకరణకు మరో 2, 3 వేల ఎకరాలు అవసరమవుతుందని చెప్పారు.
ఎకనామిక్ యాక్టివిటీ పెరగాలంటే అధిక ల్యాండ్ అవసరమవుతుందన్నారు. జగన్ అసెంబ్లీలో తొలుత 30 వేల ఎకరాలు కావాలని.. ఇటీవల 500 ఎకరాలు చాలని అన్నారని ఈ సందర్బంగా మంత్రి నారాయణ గుర్తు చేశారు. అయితే వైఎస్ జగన్ వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
వెన్నుపోటుకు.. గొడ్డలి వేట్టుకు పేటెంట్
అరాచక శక్తులను కాపాడటానికి రాజకీయాన్ని వాడుకోవద్దు
Read Latest AndhraPradesh News And Telugu News