Share News

Guillain-Barre Syndrome: జీబీఎస్‌ అంటు వ్యాధి కాదు.. ఆందోళన చెందాల్సిన పని లేదు

ABN , Publish Date - Feb 16 , 2025 | 10:22 PM

Guillain-Barre Syndrome: జీబీఎన్ వ్యాధి కారణంగా ప్రకాశం జిల్లాకు చెందిన కమలమ్మ మరణించింది. ఈ నేపథ్యంలో గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ స్పందించారు. ఫిబ్రవరి 3వ తేదీన ప్రకాశం జిల్లాకు చెందిన కమలమ్మ జీజీహెచ్‌కు వచ్చారన్నారు. దాదాపు రెండు వారాల పాటు ఆమెకు మెరుగైన వైద్య చికిత్స అందించామని వివరించారు.

Guillain-Barre Syndrome: జీబీఎస్‌ అంటు వ్యాధి కాదు.. ఆందోళన చెందాల్సిన పని లేదు
dola bala veeranjaneya swamy

ఒంగోలు, ఫిబ్రవరి 16: జీబీఎస్ వ్యాధి పట్ల ప్రజలెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఆదివారం గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రిలో జీబీఎస్ వైరస్ కారణంగా ప్రకాశం జిల్లాకు చెందిన కమలమ్మ మృతి చెందారు. ఈ నేపథ్యంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఒంగోలులో ఈ రోజు స్పందించారు. జీబీఎస్ అంటు వ్యాధి కాదని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు సూచించారు.

ఈ వ్యాధికి అన్ని ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఎవరికైనా ఈ వ్యాధి లక్షణాలున్నట్లయితే వెంటనే తగిన వైద్యం అందించాలంటూ వైద్యులకు ఆయన సూచించారు. ఈ అంశంపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారన్నారు. ప్రజారోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్జప్తి చేశారు. ఈ వ్యాధి పట్ల ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించాల్సి ఉందన్నారు.


మరోవైపు ఇదే అంశంపై గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ స్పందించారు. జీజీహెచ్‌లో గులియన్ బెరీ సిండ్రోమ్ (జీబీఎస్)తో మహిళ మృతి చెందారని తెలిపారు. ఫిబ్రవరి 3వ తేదీన ప్రకాశం జిల్లాకు చెందిన కమలమ్మ జీజీహెచ్‌కు వచ్చారన్నారు. దాదాపు రెండు వారాల పాటు ఆమెకు మెరుగైన వైద్య చికిత్స అందించామని ఆయన వివరించారు. అయితే కమలమ్మకు రెండు సార్లు కార్డియాక్ ఆరెస్ట్ సమస్య వచ్చిందని.. అయితే మరోమారు ఈ సమస్య రావడంతో ఈ రోజు ఆమె మృతి చెందారని పేర్కొన్నారు.

Also Read : అమ్మ ఆస్తులు.. పూర్తయిన అప్పగింతలు

Also Read: ఇద్దరు పిల్లలున్న తల్లిని పెళ్లి చేసుకున్నాడు.. తర్వాత తల పట్టుకున్నాడు.. ఎందుకంటే..?

Also Read : సీఎం రేవంత్‌కి బీజేపీ ఎంపీ సవాల్


మరోవైపు ఇదే సమస్యతో మరో మహిళ బాధపడుతూ.. ఐసీయూలో చికిత్స పొందుతున్నారన్నారు. అయితే మరో వ్యక్తి పరిస్థితి మెరుగుపడిందని వివరించారు. ఇక జీబీఎస్ వ్యాధి గురించి అనవసరమైన ఆందోళన చెందవద్దంటూ ప్రజలకు ఈ సందర్భంగా ఆయన సూచించారు.

Also Read : ఏపీలో జీబీఎస్ తొలి మరణం.. అప్రమత్తమైన ప్రభుత్వం

Also Read : పద్ధతి మార్చుకోని యూఎస్.. కాళ్లకు, చేతులకు బేడీలు

Also Read : 104 ఏళ్ల బామ్మ.. జైలుకు ఎందుకు వెళ్లిందంటే..?


ఈ వ్యాధి వచ్చిన వారిలో మరణాలు 5 శాతం లోపే ఉందన్నారు. జీబీఎస్ వ్యాధి బాధితులకు జీజీహెచ్‌లో అత్యుత్తమ వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఈ వ్యాధి పట్ల అవగాహన పెంచుకుని అప్రమత్తంగా ఉంటే మంచిదని గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ స్పష్టం చేశారు.

మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అనారోగ్యంతో బాధపడుతూ 101 సం లో నటి కృష్ణవేణి కన్నుమూత..!

మాట తప్పిన మాజీ ఎంపీ కేశినేని నాని..!

కాకరకాయ రసం తాగడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?

For AndhraPradesh News and Telugu News

Updated Date - Feb 16 , 2025 | 10:24 PM