ZPTC Election: టీడీపీ ఖాతాలో జడ్పీటీసీలు.. వైసీపీకి హైకోర్టు షాక్
ABN , Publish Date - Aug 14 , 2025 | 07:16 PM
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. సరిగ్గా అదే సమయంలో వైసీపీకి ఏపీ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది.
అమరావతి, ఆగస్టు 14: వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, ఆ పార్టీ అగ్రనాయకత్వానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. పులివెందుల, ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించిన వైసీపీ దాఖలు చేసిన లంచ్‌మోషన్ పిటిషన్‌ను ఇవాళ (గురువారం) ఏపీ హైకోర్టు కొట్టివేసింది. పులివెందులలో 15, ఒంటిమిట్టలోని 30 జడ్పీటీసీ పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలంటూ ఏపీ హైకోర్టులో వైసీపీ పిటిషన్ దాఖలు చేసిది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఆ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉపఎన్నిక రీపోలింగ్ అంశంపై ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది. అయితే ఈసీ నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని పేర్కొంది.
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీలకు ఉపఎన్నికను ఆగస్టు 12వ తేదీన నిర్వహించారు. ఈ ఎన్నికల్లో పులివెందుల టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి 6,035 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అలాగే ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి 6,267 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ రెండు స్థానాలను నుంచి వైసీపీ తరఫున బరిలో దిగిన హేమంత్ రెడ్డి(పులివెందుల) డిపాజిట్ కోల్పోగా.. ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి (ఒంటిమిట్ట)కి 6,513 ఓట్లు వచ్చాయి. ఇక పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో 74 శాతం ఓటింగ్ నమోదైంది. అయితే, తాజాగా హైకోర్టు తీర్పుతో వైసీపీ నేతలకు షాక్ తగినట్లు అయ్యింది.
ఈ వార్తలు కూడా చదవండి..
పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్..
సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ
For More AndhraPradesh News And Telugu News