Share News

Land Prices : 1 నుంచి భూముల ధరలు పెంపు!

ABN , Publish Date - Jan 28 , 2025 | 03:46 AM

ఫిబ్రవరి 1 నుంచి భూముల ధరలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రిజిస్ర్టేషన్‌ చార్జీలు కూడా పెరగనున్నాయి.

Land Prices : 1 నుంచి భూముల ధరలు పెంపు!

  • భారీగా ఉన్నచోట తగ్గింపు.. అమరావతికి మినహాయింపు

  • 2024-25లో అంచనాలు చేరని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం.. వచ్చే 2 నెలల్లో 10 వేల కోట్లు లక్ష్యం

అమరావతి, జనవరి 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా భూముల మార్కెట్‌ విలువల పెంపునకు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 1 నుంచి భూముల ధరలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రిజిస్ర్టేషన్‌ చార్జీలు కూడా పెరగనున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ అంశంపై కసరత్తు జరిగినా పలు వర్గాల నుంచి అభ్యంతరాలు రావడంతో ఈ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా మార్కెట్‌ ధరలకు అనుగుణంగా భూముల ధరలను సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో భూముల విలువ 10 నుంచి 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. గతంలో ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న రెండు గ్రామాల్లో భూముల ధరలు వేర్వేరుగా ఉండేవి. అలాంటి లోపాలను ఇప్పుడు సరిదిద్దారు. రాజధాని అమరావతికి పెట్టుబడులతో పాటుగా ప్రపంచస్థాయి సంస్థలను తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతం పరిధిలోని 29 గ్రామాల్లో భూముల ధరలతో పాటు రిజిస్ర్టేషన్‌ చార్జీల్లో ఎలాంటి మార్పులు చేయడం లేదు. అదే సమయంలో డిమాండ్‌ భారీగా ఉన్న విజయవాడ, గుంటూరు, భోగాపురం, విశాఖపట్టణం తదితర ప్రాంతాల్లో భూముల ధరలతో పాటుగా రిజిస్ర్టేషన్‌ చార్జీలు కూడా పెంచనున్నారు.

10 వేల కోట్లు వస్తాయని..

స్టాంపులు, రిజిస్ర్టేషన్ల శాఖ ఆదాయం ప్రభుత్వం ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. 2024-25 బడ్జెట్‌లో రూ.13,500 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. కానీ, ఏప్రిల్‌-డిసెంబరు మధ్య కేవలం రూ.6,388 కోట్లు మాత్రమే వచ్చింది. అంచనా వేసిన ఆదాయంలో కనీసం సగం కూడా రాలేదు. జనవరిలో కూడా ఆదాయం కూడా ఆశాజనకంగా లేదు. ఫిబ్రవరి, మార్చి ఈ రెండు నెలల్లో భూముల ధరలు పెంపు వల్ల ఆదాయం కొంత మేర పెరుగుతుందని భావిస్తున్నారు. బడ్జెట్లో అంచనా వేసినంత కాకపోయినా రూ.10,000 కోట్ల ఆదాయమైనా సాధించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan: నువ్వు మరిన్ని రికార్డులు నెలకొల్పాలి.. దేవాన్ష్‌కు పవన్ అభినందనలు

Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 28 , 2025 | 03:46 AM