Chandrababu Naidu: ఈరోజు రాత్రి ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. కీలక నేతలతో భేటీ
ABN , Publish Date - Feb 19 , 2025 | 06:35 PM
రేపు ఢిల్లీలో జరిగే నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ క్రమంలో ఈరోజు రాత్రే చంద్రబాబు ఢిల్లీ చేరుకుని, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.
రేపు ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం (Delhi CM Oath Ceremony) నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో నేడు రాత్రి ఢిల్లీ చేరుకోనున్న ముఖ్యమంత్రి.. అక్కడ కేంద్ర మంత్రులతో కీలక భేటీలు నిర్వహించనున్నారు. ఈ భేటీలలో హోంమంత్రి అమిత్ షా, కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్, కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌లతో చంద్రబాబు భేటీ అయ్యే ఛాన్సుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించి పలు ప్రాజెక్టులపై, అలాగే ఇతర సాయంపై చర్చించనున్నారు.
కేంద్ర జల శక్తి మంత్రితో
ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కేంద్ర సహాయం పొందేందుకు ఈ భేటీ ఎంతో కీలకంగా మారనుంది. రాష్ట్రంలో జరుగుతున్న పలు ప్రాజెక్టులను వేగవంతంగా అమలు చేసేందుకు నిధుల విడుదల చేయాలని అమిత్ షాతో ముఖ్యమంత్రి సమాలోచనలు చేయనున్నారు. దీంతోపాటు ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. ఈ భేటీలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిధుల విడుదల అంశంపై చర్చ జరగనుంది. ముఖ్యంగా ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలను 17,500 క్యూసెక్కుల నీటి తరలింపు సామర్థ్యంతో నిర్మించేందుకు అవసరమైన ఆర్థిక సాయంపై అభ్యర్థన చేయనున్నారు.
కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రితో ఈ సమస్యలపై
ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కూడా భేటీ కానున్నారు. ఈ భేటీలో ముఖ్యంగా మిర్చి రైతుల సమస్యలపై చర్చ జరగనుంది. ఇటీవల మిర్చి ధర పతనం కారణంగా ఆ రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి ఈ సమస్యపై కేంద్రం నుంచి సాయం కోరనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఇప్పటికే పలు మార్లు కేంద్రానికి లేఖలు రాసి, రైతులకు సరైన ధరలు, ప్రోత్సాహకాలు అందించాలని కోరారు.
ఢిల్లీ నుంచి తిరిగి అమరావతి
ఈ సమావేశాలు ముగించుకున్న తర్వాత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 20వ తేదీ రాత్రి తిరిగి అమరావతికి చేరుకోనున్నారు. ఈ సమావేశాలు రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి ఎంతో కీలకం కానున్నాయి. ముఖ్యమంత్రి ఢిల్లీ కార్యక్రమం తర్వాత అమరావతికి చేరుకుని, అక్కడి ప్రభుత్వ కార్యాలయాల పనులు, తదితర కార్యక్రమాలకు సంబందించిన ఆదేశాలు ఇవ్వనున్నారు. దీంతో ఈ ఢిల్లీ పర్యటన రాష్ట్ర ప్రజలకు చాలా ఉపయోగకరంగా మారే అవకాశం ఉందని ఆయా వర్గాలు అంటున్నాయి.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: జగన్‌కు దమ్ము లేదు
Also Read: కొలిక్కి వస్తోన్న మదనపల్లి సబ్ కలెక్టరేట్‌లో ఫైల్స్ దగ్ధం కేసు
Also Read: ఏదో తేడాగా ఉంది
For AndhraPradesh News And Telugu News