CM Chandrababu: గవర్నర్‌తో సీఎం చంద్రబాబు భేటీ
ABN , Publish Date - Jul 11 , 2025 | 10:08 PM
రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. దాదాపు గంట పాటు వీరి సమావేశం సాగింది. ఈ సందర్భంగా వివిధ అంశాలు వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది.
అమరావతి, జులై 11: రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో సీఎం నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. శుక్రవారం విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. దాదాపు గంట పాటు వీరిద్దరు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. ఏడాది పాలనా కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన హామీలు తదితర అంశాలను గవర్నర్‌కు సీఎం చంద్రబాబు నాయుడు వివరించారని సమాచారం. ఈ సమావేశం అనంతరం రాజ్‌భవన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఆయన హైదరాబాద్‌కు బయలు దేరి వెళ్లారు. అలాగే రాష్ట్రంలో తాజా పరిస్థితులు, పరిపాలన అంశాలను ఈ సందర్భంగా గవర్నర్‌కు సీఎం చంద్రబాబు సోదాహరణగా వివరించారు.
2024, మే, జూన్ మాసంలో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కూటమికి ఆంధ్రప్రదేశ్ ఓటరు పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. సదరు ప్రభుత్వం ఇటీవల ఏడాది పాలనను పూర్తి చేసుకుంది. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేసుకుంటూ వస్తుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. ఇటీవల తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత్ లక్ష్యంగా ఉగ్రవాద దాడులు..!
అసెంబ్లీకి కాదు.. జనాల్లోకి రావడం లేదు
ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖలో తలసేమియా రన్
For More Andhrapradesh News And Telugu News