Share News

Andhra Pradesh: మరణంలోనూ వీడని బంధం.. అమ్మ వెంటే నవజాత శిశువు

ABN , Publish Date - Dec 29 , 2025 | 10:36 PM

తల్లి రక్తహీనతతో మృతి చెందగా.. నవజాతి శిశువును రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడింది. గంటల వ్యవధిలోనే తల్లి కూతుర్లు మృతి చెందడం.. ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది.

Andhra Pradesh: మరణంలోనూ వీడని బంధం.. అమ్మ వెంటే నవజాత శిశువు
Heart Breaking Tragedy

సత్యసాయి జిల్లా, డిసెంబర్ 29: తల్లి రక్తహీనతతో మృతి చెందగా.. నవజాతి శిశువును రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడింది. గంటల వ్యవధిలోనే తల్లి కూతుర్లు మృతి చెందడం.. ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. మన అనుకున్న వాళ్లు దూరమైతే కలిగే బాధ వర్ణనాతీతం. తల్లి ఒడిలో వెచ్చగా ఆడుకోవాల్సిన బిడ్డ.. తల్లిని కోల్పోగా.. ఆ కాసేపటికే ఆ బిడ్డ సైతం మృత్యువాత పడటం బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. తన భార్య బిడ్డకు జన్మనిచ్చిందన్న ఆనందం ఆ భర్త మొఖంలో ఎంతసేపూ లేదు. దేవుడు ఆ కుటుంబంపై చిన్న చూపు చూడడంతో రక్తహీనతతో తల్లి మృతి చెందగా తల్లి మృతదేహంతో వాహనంలో వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో నవజాతి శిశువు మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణ సమీపంలోని బసవన్నపల్లిలో చోటుచేసుకుంది.


ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు.. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణ సమీపంలోని బసనపల్లికి చెందిన నజ్మాను బత్తలపల్లి మండలానికి చెందిన కలీంకు ఇచ్చి మూడు సంవత్సరాల క్రితం వివాహం చేశారు. బత్తలపల్లి గ్రామంలోనే ఫాస్ట్ ఫుడ్ వ్యాపారం చేసుకుంటూ కలీం, నజ్మా కుటుంబం జీవనం సాగిస్తున్నారు. ఏడాదిన్నర క్రితం మొదటి కాన్పు హిందూపురంలో పాపకు జన్మనిచ్చింది. అనంతరం రెండవ కాన్పుకు రెండు నెలల క్రితం పుట్టింటికి నగ్మా వచ్చింది. ఈ క్రమంలో పురిటి నొప్పులు రావడంతో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి శనివారం రాత్రి తరలించారు. అదేరోజు రాత్రి ఆడబిడ్డ జన్మించింది. చికిత్స అందించిన వైద్యులు బాలింతకు రక్తం తక్కువగా ఉందని మెరుగైన వైద్యం కోసం అనంతపురం వెళ్లాలని సూచించడంతో కుటుంబ సభ్యులతో కలిసి బాలింతను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నజ్మా ఆదివారం రాత్రి మృతి చెందింది. అంత్యక్రియల కోసం హిందూపురం సమీపంలోనే బసనపల్లి గ్రామానికి మహా ప్రస్థానం వాహనం వైనుక భాగంలో మృతదేహాన్ని, ముందు భాగంలో భర్త కలీం, నవజాత శిశువు, పలువురు కుటుంబ సభ్యులు తరలి వెళ్తున్నారు.


ఈ క్రమంలో పెనుకొండ సమీపంలో 44వ జాతీయ రహదారి వద్ద ముందు వెళ్తున్న లారీని మహాప్రస్థానం వాహనం ఢీకొట్టింది. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో నవజాత శిశువు ఉలుకు పలుకు లేకుండా ఉండడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శిశువును వైద్యులు పరీక్షించగా అప్పటికే మృతి చెందిందని తెలపడంతో దిక్కుతోచక ఆ తండ్రి స్పృహతప్పి పడిపోయాడు. గంటల వ్యవధిలోనే తల్లి కూతురు మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఓ పక్క భార్య, మరో పక్క కూతురు మృతితో తండ్రి ఖలీమ్ అల్లాడిపోయాడు. ఆయన రోధించిన తీరు పలువురికి కంటతడి పెట్టించాయి.


Also Read:

అన్ని దేవాలయాల్లో శ్రీవారి సేవకులు తరహా విధానం: సీఎం

ఘోర విషాదం.. కొడుకును చూసేందుకు వచ్చి..

అవి ముమ్మాటికీ జగన్ హత్యలే.. మంత్రి కొల్లు రవీంద్ర షాకింగ్ కామెంట్స్..

Updated Date - Dec 29 , 2025 | 10:36 PM