Hyderabad: ఘోర విషాదం.. కొడుకును చూసేందుకు వచ్చి..
ABN , Publish Date - Dec 29 , 2025 | 10:06 PM
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సన్ సిటీ సమీపంలో మూన్ రాక్ అపార్ట్‌మెంట్‌లో తన కొడుకు దగ్గరికి ఒక శుభకార్యానికి వచ్చిన లక్ష్మమ్మ(60), లింగయ్య భార్యాభర్తలు ఇద్దరు కలిసి తన కొడుకు ఇంటికి వచ్చి శుభకార్యం కార్యక్రమం ముగించుకొని తిరిగి షామీర్పేట్‌లో
రంగారెడ్డి, డిసెంబర్ 29: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సన్ సిటీ సమీపంలో మూన్ రాక్ అపార్ట్‌మెంట్‌లో తన కొడుకు దగ్గరికి ఒక శుభకార్యానికి వచ్చిన లక్ష్మమ్మ(60), లింగయ్య భార్యాభర్తలు ఇద్దరు కలిసి తన కొడుకు ఇంటికి వచ్చి శుభకార్యం కార్యక్రమం ముగించుకొని తిరిగి షామీర్పేట్‌లో తన నివాసానికి వెళ్తున్న సమయంలో అపార్ట్‌మెంట్‌లో ఉన్న లిఫ్టు వద్దకు వచ్చి లిఫ్ట్ డోర్ ఓపెన్ ఉందనుకొని లక్ష్మమ్మ అందులో కాలు పెట్టింది. దీంతో ఒక్కసారిగా లిఫ్ట్‌లో కిందపడిపోయింది. ఈ ఘటనలో లక్ష్మమ్మ అక్కడే ప్రాణాలు కోల్పోయింది.
తన భార్య కళ్ల ముందే లిఫ్ట్‌లో పడి చనిపోవడాన్ని చూసిన భర్త లింగయ్య బోరున విలపించాడు. లింగయ్య ఏడుపు విని అపార్ట్‌మెంట్ వాసులు బయటకు వచ్చారు. లిఫ్ట్‌లో పడిపోయిన లింగమ్మను బయటకు తీసి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. కాగా, అపార్ట్‌మెంట్‌లో ఉన్న లిఫ్టును మెయింటెనెన్స్ సరిగా లేదని అపార్ట్‌మెంట్ వాసులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read:
Picture Puzzle: మీ ప్రతిభకు పరీక్ష.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 25 సెకెన్లలో కనిపెట్టండి
New Year Celebrations: హ్యాంగోవర్ నుంచి ఇలా బయటపడండి..
Revanth Reddy Tirumala visit: తిరుమల చేరుకున్న రేవంత్ రెడ్డి.. స్వాగతం పలికిన ఏపీ మంత్రులు..