AP New: త్వరలో 1050 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు..
ABN , Publish Date - Sep 26 , 2025 | 01:38 PM
ప్రయాణికుల సౌకర్యార్థం ప్రస్తుతం ఉన్న బస్సులకు అదనంగా మరో 1050 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. కడప గ్యారేజీని ఆర్టీసీ ఎండీతో పాటు ఈడీఈ చెంగల్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్యారేజీ, బస్టాండు స్థితిగతులను గురించి కడప ఆర్‌ఎం గోపాల్‌రెడ్డి, ఇతర అధికారులతో ఆరా తీశారు.
- కడప బస్టాండులో రూ.1.30 కోట్లతో సీసీ రోడ్డు
- ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు
కడప: ప్రయాణికుల సౌకర్యార్థం ప్రస్తుతం ఉన్న బస్సులకు అదనంగా మరో 1050 ఎలక్ట్రిక్ బస్సులు(Electric buses) రానున్నాయని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు(RTC MD Dwaraka Tirumala Rao) తెలిపారు. కడప గ్యారేజీని ఆర్టీసీ ఎండీతో పాటు ఈడీఈ చెంగల్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్యారేజీ, బస్టాండు స్థితిగతులను గురించి కడప ఆర్‌ఎం గోపాల్‌రెడ్డి, ఇతర అధికారులతో ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప ఆర్టీసీ బస్టాండు ఆవరణాన్ని పూర్తిగా సిమెంటు రోడ్డుతో తీర్చిదిద్దేందుకు అనువుగా రూ.1.30 కోట్లుతో త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు.
గతంలో వర్షాలు కురిస్తే ఆర్టీసీ బస్టాండు ఆవరణ మొత్తం మోకాటిలోతు నీటితో ఉండేదని, ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవన్నారు. స్ర్తీశక్తి పథకం అమలు చేసినప్పటి నుంచి బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. అందుకనుగుణంగా అన్ని బస్టాండ్లలో ప్రయాణికుల కోసం కుర్చీలు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం మరింత నాణ్యతతో ఉండేలా చూస్తామన్నారు. పొరుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో ఉచితంగా ప్రయాణిస్తున్న మహిళలు ఎంతో ఓర్పు, సహనంతో ఉన్న తీరు అభినందనీయమన్నారు.

ఆ కోవలో ప్రయాణం చేసే మహిళలు, ఇతరుల పట్ల ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు ఎంతో మర్యాదపూర్వకంగా బాధ్యతాయుతంగా మెలగాలని సూచించారు. గ్యారేజీ సిబ్బంది సైతం అంకితభావంతో సేవలందించాలని, సమయపాలన తప్పక పాటించి ప్రజల మన్ననలు అందుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎంఎ ఢిల్లీశ్వర్‌రావు, ఆర్టీసీ అసోసియేషన్ నాయకులు కేకే కుమార్, ఎం,పురుషోత్తం, ఏఆర్ మూర్తితో పాటు పలువురు ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్..మళ్లీ తగ్గిన బంగారం, కానీ వెండి రేట్లు మాత్రం..
కాంగ్రెస్ చిల్లర వేషాలు వేస్తోంది.. ఎంపీ అర్వింద్ ఫైర్
Read Latest Telangana News and National News