Collector Vinod Kumar : డీఆర్వో ‘రమ్మీ’పై విచారణకు ఆదేశం
ABN , Publish Date - Jan 22 , 2025 | 05:19 AM
ఎస్సీ ఉప కులాల వర్గీకరణ అంశంపై ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా అభిప్రాయాలు సేకరించే సమయంలో..
అనంతపురం, జనవరి 21(ఆంధ్రజ్యోతి): ఎస్సీ ఉప కులాల వర్గీకరణ అంశంపై ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా అభిప్రాయాలు సేకరించే సమయంలో.. వేదికపైనే ఆన్‌లైన్ రమ్మీ ఆడిన అనంతపురం డీఆర్వో మలోల వ్యవహారంపై కలెక్టర్ వినోద్‌కుమార్ విచారణకు ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటనపై ‘ఆంధ్రజ్యోతి’లో మంగళవారం ప్రచురితమైన కథనం కలకలం రేపింది. ఉన్నతాధికారుల పక్కనే కూర్చుని సెల్‌ఫోన్‌లో డీఆర్వో రమ్మీ ఆడటాన్ని కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. ఆయనపై మండిపడ్డారు. విచారించి, రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మను ఆదేశించారు. జేసీ వెంటనే విచారణ ప్రారంభించారు. డీఆర్వో రమ్మీ వీడియోను సేకరించి, సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించినట్లు తెలిసింది. జేసీ నివేదిక ఆధారంగా డీఆర్వోపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాగా, డీఆర్వో తీరుపై దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి తదితరులు జాయింట్ కలెక్టర్‌ను కలిసి డీఆర్వోను సస్పెండ్ చేయాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
Palla Srinivas: టీడీపీ కోటి సభ్యత్వం.. ఆ ముగ్గురిదే ఘనత
Chandrababu: వీర జవాన్ కార్తీక్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం..
CM Chandrababu: దిగ్గజ కంపెనీల అధిపతులతో సమావేశాలు.. చంద్రబాబు షెడ్యూల్ ఇదే
Read Latest AP News And Telugu News