Share News

Pawan Kalyan Help: అంధ క్రికెటర్ల వేదనకు చలించిన పవన్ కల్యాణ్.. వెంటనే మంజూరు..

ABN , Publish Date - Dec 13 , 2025 | 09:44 PM

ఇటీవల ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు సభ్యులను, ఏపీకి చెందిన కెప్టెన్ దీపిక, క్రీడాకారిణి పాంగి కరుణ కుమారిలను ఏపీ డిప్యూటీ సీఎం సన్మానించి, గొప్ప సాయం చేసి తన మంచి మనసు చాటుకున్నారు.

Pawan Kalyan Help: అంధ క్రికెటర్ల వేదనకు చలించిన పవన్ కల్యాణ్.. వెంటనే మంజూరు..

ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు సభ్యులను ఏపీ డిప్యూటీ సీఎం అభినందించారు. అంతేకాదు వారి విజ్ఞప్తి కి యుద్ద ప్రాతిపదికన స్పందించారు. 24 గంటల్లోనే తన సొంత డబ్బుతో సహాయం అందించి మంచి మనసు చాటుకున్నారు. అంద మహిళా క్రికెట్ కెప్టెన్ తో పాటు మరో క్రీడాకారిణి పాంగి కరుణ కుమారి కుటుంబాలకు టీవీ, ఫ్యాన్, ఇతర గృహోపకరణాలు, నిత్యావసర సరుకులు, నూతన వస్త్రాలతో పాటు దుప్పట్లు పంపించారు పవన్ కళ్యాన్. అంతేకాదు ఒక్కో క్రీడాకారిణికి రూ.5 లక్షల చొప్పున సొంత డబ్బు అందించారు. దీంతో వారి ఇళ్లల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి.


డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ని కలిసిన సందర్భంగా సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం అమలాపురం మండలానికి చెందిన కెప్టెన్ దీపిక తన గ్రామ రోడ్ల పరిస్థితి గురించి విన్న వించింది. రోడ్లు అధ్వాన్నంగా ఉండటం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. చదువుకోవడం, క్రీడలకు దూరంగా ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై వెంటనే స్పందించిన పవన్ కళ్యాన్ సంబంధిత జిల్లా అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.


ఆ గ్రామానికి వెళ్లి రోడ్ల పరిస్థితి సమీక్షించి నివేదిక వెంటనే ఇవ్వాలని కోరారు. ఆయన ఆదేశాల మేర తంబలహట్టి తండా, వంట్ల మామిడి గ్రామాలకు వెళ్లారు అధికారులు. దీపిక విజ్ఞప్తి మేర ఆమె స్వగ్రామానికి రూ.6.2 కోట్లు మంజూరు చేసినట్లు సమాచారం. సమస్య ఎవరిదైనా.. తన తృష్టికి తీసువెళ్తే వెంటనే అర్థం చేసుకొని పరిష్కరిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్. ప్రభుత్వ పరంగా చూపే పరిష్కారం అయినా.. వ్యక్తిగతంగా చేసే సహాయమైనా వెంటనే పూర్తి చేస్తున్నారు. పవన్ కళ్యాన్ చేసిన సహాయానికి కెప్టెన్ దీపిక, పాంగి కరుణతో పాటు గ్రామస్థులు ధన్యవాదాలు తెలిపారు.


ఇవీ చదవండి:

కోల్‌కతాలో మెస్సీ 'గోట్ ఇండియా టూర్' ఆర్గనైజర్ అరెస్ట్

ప్రజాతీర్పును గౌరవించాల్సిందే.. బీజేపీ విక్టరీని అభినందించిన శశిథరూర్

Updated Date - Dec 13 , 2025 | 09:56 PM