ROAD : అధ్వానంగా పాలబావి రోడ్డు
ABN , Publish Date - Jan 07 , 2025 | 12:11 AM
మండలంలోని బండమీదపల్లి నుం చి పాలబావికి వెళ్లే మట్టి రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. రోడ్డు మొ త్తం రాళ్లు తేలి గుంతలమయమైంది. దీంతో బండమీదపల్లి నుంచి పాల బావి కి వెళ్లే వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రాప్తాడు, జనవరి 6(ఆంధ్రజ్యోతి): మండలంలోని బండమీదపల్లి నుం చి పాలబావికి వెళ్లే మట్టి రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. రోడ్డు మొ త్తం రాళ్లు తేలి గుంతలమయమైంది. దీంతో బండమీదపల్లి నుంచి పాల బావి కి వెళ్లే వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాలబావి విద్యార్థులు ప్రతి రోజు బండమీదపల్లి ఉన్నత పాఠశాలకు కాలినడకన వెళ్తారు. రోడ్డు సరిగా లేకపోవడం, బండ మీదపల్లి చెరువు వద్ద బురద నీళ్లలో నడవాల్సి ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ రోడ్డు గుండా పొలాలకు వెళ్లే రైతులు ద్విచక్రవాహనా లు, ట్రాక్టర్లలో వెళ్లేందుకు బురద నీటిలో నానా అవస్థలు పడుతున్నారు. అధికారులు. ప్రజా ప్రతినిధులు స్పందించి బండమీదపల్లి నుంచి పాలబావికి వెళ్లే రోడ్డును బాగు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....