Share News

RE - SURVEY : పైలట్‌ రీసర్వే సక్రమంగా జరిగేనా..?

ABN , Publish Date - Jan 21 , 2025 | 12:40 AM

వైసీపీ పాలనలో చేపట్టిన భూ రీసర్వేలో రైతుల భూ విస్తీర్ణానికి సంబంధించి భారీ వ్యత్యాసాలు వచ్చాయనే విమర్శలు వచ్చాయి. దీంతో చాలా చోట్ల రీసర్వే వద్దన్నారు. అయినా పాల కులు అధికాలు బలవంతంగా భూ రీసర్వే చేపట్టి, వ్యత్యాసాలతోనే జాయింట్‌ ఖాతా నంబర్లు, ఎల్‌పీ నంబర్లతో భూహక్కు పుస్తకాలను సంబంధిత రైతుల కు ఇచ్చి, అలాగే వైబ్‌ల్యాండ్‌లో నమోదు చేశారు.

RE - SURVEY : పైలట్‌ రీసర్వే సక్రమంగా జరిగేనా..?
Officials conducting land resurvey in Padda Matlagondi

గత వైసీపీ పాలనలో భారీ తప్పులు... ఆందోళనలో రైతులు

శింగనమల, జనవరి 20(ఆంధ్రజ్యోతి) : వైసీపీ పాలనలో చేపట్టిన భూ రీసర్వేలో రైతుల భూ విస్తీర్ణానికి సంబంధించి భారీ వ్యత్యాసాలు వచ్చాయనే విమర్శలు వచ్చాయి. దీంతో చాలా చోట్ల రీసర్వే వద్దన్నారు. అయినా పాల కులు అధికాలు బలవంతంగా భూ రీసర్వే చేపట్టి, వ్యత్యాసాలతోనే జాయింట్‌ ఖాతా నంబర్లు, ఎల్‌పీ నంబర్లతో భూహక్కు పుస్తకాలను సంబంధిత రైతుల కు ఇచ్చి, అలాగే వైబ్‌ల్యాండ్‌లో నమోదు చేశారు. రీ సర్వే వల్ల భూముల విస్తీర్ణం తదితర విషయాల్లో వచ్చిన తప్పులను సరిచేసుకునేందుకు రైతులు ఇప్పటి వరకు తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. తప్పుల వల్ల బ్యాంకు రుణాల విషయంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. అయితే రీసర్వే రద్దు చేసి పాత పద్ధతినే అమలు చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వ ఏర్పడడంతో రైతులు ఊపిరి పీల్పుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం రీసర్వేని రద్దు చేయకపోగా, మరలా పైలెట్‌ గ్రామాలను ఎంపిక చేసి భూ ముల రీసర్వే చేపట్టడంతో రైతుల్లో ఆందోళన మెదలైంది. ఈ రీసర్వేనైనా ఎలాంటి తప్పులు లేకుండా చేయాలని అధికారులను రైతులు కోరుతున్నారు.

పైలట్‌ గ్రామం పెద్ద మట్లగొందిలో రీసర్వే

మండలంలోని పెద్ద మట్లగొంది రెవెన్యూ గ్రామంలో ఉన్న 2.685 ఎకరాల ను పైలట్‌ రీసర్వేకు ఎంపిక చేశారు. అందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృదం ప్రతి రోజు దాదాపు 20 ఎకరాల్లో సర్వే చేసే విధంగా ప్రణాళికలు తయారు చేసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమగ్ర రీసర్వే చేసేట్లు సోమవారం పనులు ప్రారంభించారు. గత వైసీపీ పాలనలో 13 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే పనులు చేయగా అన్ని చోట్ల భారీ ఎత్తున వ్యత్యాసాలు రావడంతో కొన్ని గ్రామాల్లో అధికారులను రైతులు నిలదీ శారు. ఇప్పుడు పైలెట్‌ గ్రామాల్లో రీసర్వే ఖచ్చితంగా చేస్తారో చేదో వేచిచూడాలి.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jan 21 , 2025 | 12:40 AM