Share News

MLA : సీఎం, డిప్యూటీ సీఎం ఫొటోలెక్కడ..?

ABN , Publish Date - Jan 29 , 2025 | 12:37 AM

కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడు నెలలు కావస్తున్నా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవనకళ్యాణ్‌ ఫొటోలు వార్డు సచివాలయంలో పెట్టకపోవడంపై ఎమ్మె ల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

MLA : సీఎం, డిప్యూటీ సీఎం ఫొటోలెక్కడ..?
MLA expressing anger at the secretariat staff

సచివాలయ సిబ్బందిపై ఎమ్మెల్యే దగ్గుపాటి ఆగ్రహం

అనంతపురం అర్బన, జనవరి 28(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడు నెలలు కావస్తున్నా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవనకళ్యాణ్‌ ఫొటోలు వార్డు సచివాలయంలో పెట్టకపోవడంపై ఎమ్మె ల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఆదర్శనగర్‌లోని 46వ సచివాలయాన్ని ఎమ్మెల్యే మంగళవారం ఆకస్మి కంగా తనిఖీ చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం ఫొటోలు ఎక్కడా..? అని సిబ్బందిని నిలదీశారు. వెంటనే ఆ ఫొటోలు పెట్టాలని ఆదేశించారు. సచివాలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోకుండా ఇంత నిర్లక్ష్యం వహిస్తారా అంటూ మండిపడ్డారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిం చడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. అనంతరం అంగన వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీలో అక్రమాలకు పాల్పడితే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు గంగా రామ్‌, మాజీ కార్పొరేటర్‌ సరిపూటి రమణ, నాయకులు పీఎల్‌ఎన మూర్తి, కూచి హరి, రామ్‌ప్రసాద్‌, సుధాకర్‌యాదవ్‌, వెంకటేశ్వరరెడ్డి, వన్నూరప్ప, మహబూబ్‌బాషా, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jan 29 , 2025 | 12:37 AM