BRIDGE : పునరుద్ధరణ ఎప్పుడో..?
ABN , Publish Date - Mar 07 , 2025 | 11:41 PM
నగర సమీపంలోని ఉప్పరపల్లి క్రాస్‌లో పండమేరు బ్రిడ్జి మూతపడి, రాకపోకలు పూర్తిగా నిలిచి పోయాయి. ఇది జరిగి నాలుగు గడిచినా, బ్రిడ్జిపై వాహన సంచారానికి మోక్షం కలగడం లేదు. ఫలితంగా కొత్త ఏర్పాటు చేసిన బ్రిడ్జి ఒనవే కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతు న్నారు.

- 4 నెలలుగా మూతపడిన పండమేరు పాత బ్రిడ్జి
- రాకపోకలు బంద్...- మరమ్మతుల్లో జాప్యం
- ఒన వే బ్రిడ్జిపై తరచూ ప్రమాదాలు
- భయబ్రాంతులకు గురవుతున్న ప్రజలు
అనంతపురం రూరల్, మార్చి 8(ఆంధ్రజ్యోతి): నగర సమీపంలోని ఉప్పరపల్లి క్రాస్‌లో పండమేరు బ్రిడ్జి మూతపడి, రాకపోకలు పూర్తిగా నిలిచి పోయాయి. ఇది జరిగి నాలుగు గడిచినా, బ్రిడ్జిపై వాహన సంచారానికి మోక్షం కలగడం లేదు. ఫలితంగా కొత్త ఏర్పాటు చేసిన బ్రిడ్జి ఒనవే కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతు న్నారు. దీనికితోడు ఉప్పర పల్లి క్రాస్, బ్రిడ్జి మలుపు వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో వాహనదారు లు, ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.
నాలుగు నెలలుగా రాకపోకలు బంద్
ఉప్పరపల్లి క్రాస్ వద్ద ఉన్న పండమేరు పాత బ్రిడ్జిని 2000-2006 మధ్య నిర్చించినట్లు తెలుస్తోంది. దాదాపు ఇరవై ఏళ్లు కావస్తోంది. ఈ నేపథ్యంలో గత ఏడాది అక్టోబరులో కురిసిన భారీ వర్షాలకు పండమేరు పో టెత్తింది. వరద నీటి ఉధృతికి పాత బ్రిడ్జి కొంత మేర దెబ్బతిన్నట్లు సంబంధిత అధికారుల ద్వారా తెలుస్తోంది. దీంతో బ్రిడ్జిపై రాకపోకలను పూర్తిగా బంద్ చేశారు. ఆర్డీటీ మైదానం వద్ద కదిరి వైపు నుంచి అనంతపురానికి వచ్చే ప్రధాన రహదారిపై బార్ గేట్లను ఏర్పాటు చేశారు. మొదట్లో ద్విచక్రవాహనాలను అనుమతించలేదు. అయితే కొందరు వాహనదారులు ద్విచక్రవాహనాలు వెళ్లేలా బార్‌గేట్లను కొంత ఓపెన చేసుకున్నారు.
భయబ్రాంతుల్లో వాహనదారులు
పాత బ్రిడ్జి మూత పడటంతో బళ్లారి రోడ్డు సర్కిల్ నుంచి పంగల్ రోడ్డు వద్ద వరకు నూతనంగా నిర్మించిన రోడ్డుపై ఇరువైపుల నుంచి రాకపోకలు అనుమతించారు. కొత్త బ్రిడ్జిపై రెండు బస్సులు ఎదురు..ఎదురుగా వచ్చా యంటే మరో వాహనం వెళ్లలేదు. దానిపైనే పోలీసులు వాహనాల రాకపోకలకు అనుమతించారు. ఈ క్రమంలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు స్థానికులు, అటుగా ప్రయాణించే వాహనదారులు అంటున్నారు. బ్రిడ్జి మూత పడిన కొన్ని రోజులకే పాలవేరు వీరనాగమ్మ గుడి ఆర్చ్ వద్ద జరిగిన ప్రమాదంలో రాప్తాడుకు చెందిన ఓ వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యాడు. అతడు నేటికీ కోలుకో లేదు. ఇలాంటి సంఘటనలు నిత్యం జరుగుతుండటం అటూగా ప్రయాణించే వారిని కలవరపెడుతోంది. పాత బ్రిడ్జిపై రాకపోకలు సాగిస్తే ప్రమాదాలను నివారించే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు.
అనుమతులు రాగానే మరమ్మతులు- సుధాకర్‌రెడ్డి, ఈఈ, ఆర్‌అండ్‌బీ, నేషనల్ హైవే
వరదల సమయంలో పండమేరు బ్రిడ్జి కొంతమేర దెబ్బతింది. బ్రిడ్జి మర మ్మతుల నేపథ్యంలో వాహనాల రాకపోకలను బంద్ చేశా. బ్రిడ్జి మరమ్మతు లపై ప్రత్యేక బృందం పరిశీలించింది. బ్రిడ్జి బెడింగ్ కింద బేరింగులు దెబ్బతిన్నట్లు తెలిసింది. ఆ మేరకు మరమ్మతులకు అంచనాలు తయారు చేశారు. రూ.కోటి వరకు ఖర్చు అవుతుందని అంచనా వేసి ఉన్నాతాధి కారులకు నివేదించాం. బ్రిడ్జి మరమ్మతుల కోసం ఈ నెలాఖరికి నిధులు మంజూరు అయ్యే అవకాశం ఉంది. నిధులు మంజూరైన వెంటనే మరమ్మతుల పనులు చేపడుతాం.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....