MLA: గ్రామాల్లో రోడ్ల సమస్య పరిష్కరిస్తున్నాం
ABN , Publish Date - Feb 24 , 2025 | 12:09 AM
ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయకత్వంలో గ్రామాల్లో రోడ్ల సమస్యలు లేకుండా చేస్తున్నామని ఎమ్మెల్యే పరిటాల సునీతఅన్నారు. మండలంలోని అక్కంపల్లి పంచాయితీ లో మధురానగర్, సదాశివన కాలనీలో ఆదివారం రూ.50లక్షలతో నిర్మిస్తు న్న సీసీరోడ్లకు భూమి పూజ చేపట్టారు. ఎమ్మెల్యే పరిటాల సునీత హాజరై రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు.

ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం రూరల్, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయకత్వంలో గ్రామాల్లో రోడ్ల సమస్యలు లేకుండా చేస్తున్నామని ఎమ్మెల్యే పరిటాల సునీతఅన్నారు. మండలంలోని అక్కంపల్లి పంచాయితీ లో మధురానగర్, సదాశివన కాలనీలో ఆదివారం రూ.50లక్షలతో నిర్మిస్తు న్న సీసీరోడ్లకు భూమి పూజ చేపట్టారు. ఎమ్మెల్యే పరిటాల సునీత హాజరై రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. స్థానికంగా 250 కుటుం బాలు ఇళ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నామని, ఇళ్ల పట్టాలు వచ్చే విధంగా చూ డాలని సదాశివన కాలనీ వాసులు కోరారు. అనంతరం సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... కాలనీలో ఉన్న మిగిలిన వారికి కొత్తగా ఇంటి స్థలాలు, ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. అంగన వాడీ కేంద్రానికి నూతన భవనం నిర్మిస్తామన్నారు. పింఛన్లు, రేషనకార్డులు, తాగునీటి సమస్య ప రిష్కరిస్తామని, వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ పాలకులు గ్రామాల అభివృద్ధి గురించి మచ్చుకైనా ఆలోచించలేద న్నారు. కార్యక్రమంలో ఈఓఆర్డీ వెంకటనాయుడు, మండల కన్వీనర్ జింకా సూర్యనారాయణ, మాజీ జడ్పీటీసీ వేణుగోపాల్, మండల ప్రధాన కార్య దర్శి పామురాయి రఘు, మాజీ మండల కన్వీనర్ చల్లా జయకృష్ణ, మం డల నాయకులు నారాయణస్వామి, ఇమాముల్, ప్రదీప్‌కుమార్, మస్తాన, శ్రీనివాసులు, వెంకటనారాయణ, మారెన్న, వన్పూర్‌స్వామి, అమర్‌నాథ్, ఫకృద్దీన, లాలు, గంగన్న, పోతన్న, విష్ణు తదితరులు పాల్గొన్నారు.