Share News

Rain : ప్రత్యామ్నాయానికి పదును..!

ABN , Publish Date - Aug 07 , 2025 | 01:26 AM

ఉమ్మడి జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు ప్రత్యామ్నాయ పంటల సాగుకు ఉపయుక్తంగా మారాయి. ఖరీఫ్‌ ఆరంభంలో పదును వర్షం లేక ప్రధాన పంట వేరుశనగ అనుకున్న స్థాయిలో సాగు కాలేదు. ఈ వానలకు పదును కావడంతో కంది, ...

Rain : ప్రత్యామ్నాయానికి పదును..!

ఉమ్మడి జిల్లాలో విస్తారంగా వర్షాలు

కంది, ఆముదం సాగుకు అన్నదాత సన్నద్ధం

అనంతపురం అర్బన, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు ప్రత్యామ్నాయ పంటల సాగుకు ఉపయుక్తంగా మారాయి. ఖరీఫ్‌ ఆరంభంలో పదును వర్షం లేక ప్రధాన పంట వేరుశనగ అనుకున్న స్థాయిలో సాగు కాలేదు. ఈ వానలకు పదును కావడంతో కంది, ఆముదం విత్తేందుకు రైతులు సిద్ధమయ్యారు.

గుత్తిలో అత్యధికం

జిల్లా పరిధిలో 30 మండలాల్లో మంగళవారం రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా గుత్తి మండలంలో 71.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. పెద్దవడుగూరు 70.4, గుంతకల్లు 68.2, రాయదుర్గం 64.2, పామిడి 53.2, అనంతపురం 48.4, నార్పల 45.4, కళ్యాణదుర్గం 40.4, గుమ్మగట్ట 40.2, విడపనకల్లు 39.0, బెలుగుప్ప 37.2, బుక్కరాయసముద్రం 36.2, శింగనమల 33.6, వజ్రకరూరు 32.6, బ్రహ్మసముద్రం 30.0 మి.మీ. వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లో 27.4 మి.మీ. లోపు వర్షపాతం నమోదైంది. జూన సాధారణ వర్షపాతం 61.0 మి.మీ. కాగా 47.9 మి.మీ. నమోదైంది. జూలైలో సాధారణ వర్షపాతం 63.9 మి.మీ. కాగా 34.7 మి.మీ. నమోదైంది. ఆగస్టులో సాధారణ వర్షపాతం 83.8 మి.మీ. కాగా ఇప్పటి వరకూ 54.3 మి.మీ.

Updated Date - Aug 07 , 2025 | 01:26 AM