MLA : అన్ని చెరవులకు నీరు అందించాల్సిందే..!
ABN , Publish Date - Jan 07 , 2025 | 12:26 AM
పీఏబీఆర్ కుడి కాలువ కింద నిర్దేశించిన అన్ని చెరువులకు నీరు అందించాల్సిందేనని ఎమ్మెల్యే పరి టా ల సునీత ఇరిగేషన అధికారులను ఆదేశించారు. మండలంలో ని గోళ్లపల్లి సమీపంలో పీఏబీఆర్ కుడి కాలువలో ప్రవహిస్తున్న నీటిని రైతులతో కలిసి ఎమ్మెల్యే సోమవారం పరిశీలించారు.

ఇరిగేషన అధికారులకు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశం
పీఏబీఆర్ కుడికాలువలో నీటి ప్రవాహం పరిశీలన
రాప్తాడు, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): పీఏబీఆర్ కుడి కాలువ కింద నిర్దేశించిన అన్ని చెరువులకు నీరు అందించాల్సిందేనని ఎమ్మెల్యే పరి టా ల సునీత ఇరిగేషన అధికారులను ఆదేశించారు. మండలంలో ని గోళ్లపల్లి సమీపంలో పీఏబీఆర్ కుడి కాలువలో ప్రవహిస్తున్న నీటిని రైతులతో కలిసి ఎమ్మెల్యే సోమవారం పరిశీలించారు. ప్రస్తుతం ధర్మవరం నియో జకవర్గంలోని చివరి చెరువుకు నీరు అందిస్తున్న నేపథ్యంలో కాలువలో నీటివేగం తగ్గిందని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఎమ్మె ల్యే అధికారులకు ఫోన చేసి మాట్లాడారు. ప్రస్తుతం తాడిమర్రి మండ లంలోని చివరి చెరువుకు నీరందిస్తున్నారు. అయితే నీటి వేగం తగ్గడంపై అధికారులతో ఆరాతీశారు. ధర్మవరం నియో జకవ ర్గంలోని చెరువులకు వెళ్లే నీటి ప్రవాహం తగ్గితే ఇంక రాప్తాడు నియోజ కవర్గంలోని చెరువులన్నింటికీ నీరు ఎలా అందిస్తారని ప్రశ్నించారు. రా ప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లో కుడి కాలువ పరిధిలోని అన్ని చెరు వులకు నీరు ఇవ్వా ల్సిందేనన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల ఇన చార్జ్ ధర్మవరపు మురళి, మండల కన్వీనర్ కొండప్ప, రైతులు పాల్గొన్నారు.
పంటనష్ట వివరాలను స్పష్టంగా తెలపాలి
కనగానపల్లి, జనవరి 6(ఆంధ్రజ్యోతి): కరువు బృందం పర్యటించనున్న నేపథ్యంలో పంటనష్ట వివరాలను స్పష్టంగా తెలియజేయాలని, అందుకు అధికారులు కార్యాలయాలు వదలి పొలాలవైపు చూడాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. మండలంలోని తల్లిమడుగుల గ్రామం లో హాంద్రీనీవా కాలువ పరిదిలో రైతులు సాగుచేసిన వేరుశనగ పంటను ఎమ్మెల్యే సోమవారం పరిశీలించారు. పంట పచ్చగా ఉన్నా తెగుళ్లు కార ణంగా దిగుబడి తగ్గిందని, కనీసం పెట్టుబడులు వచ్చేట్టు కనిపించ డంలేదని రైతులు రామాంజినేయలు, సుబ్బయ్య, సూర్యనారాయణ, సరస్వతి ఎమ్మెల్యేకి వివరించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు సలహాలు, సూచనలు అందించాలని ఎమ్మెల్యే తెలిపారు. పం టనష్టాన్ని అధికారులు కరువు బృందానికి తెలిపి రైతులను ఆదుకోవా లన్నారు. ఎమ్మెల్యే వెంట సర్పంచ రామాంజినేయలు, అంజి, మనోహర నాయుడు, ఆనంద్, కిష్టయ్య, ముత్యాలు, అశ్వత్థ తదితరులు ఉన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....