GOD : కైలాస వాహనంపై విశ్వేశ్వరుడు
ABN , Publish Date - Feb 25 , 2025 | 12:32 AM
మొదటి రోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సోమవారం స్వామివారు కైలాస వాహనంపై ఊరేగారు. ఆలయంలో ఉదయం మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభి షేకం, అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించా రు.
అనంతపురం కల్చరల్, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): మొదటి రోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సోమవారం స్వామివారు కైలాస వాహనంపై ఊరేగారు. ఆలయంలో ఉదయం మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభి షేకం, అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించా రు. ఆలయ అనువంశీకుడు హోసూరు రామసు బ్రహ్మణ్యం స్వామివారికి 27 రుద్రాక్ష మాలలు, 25 స్పటికమాలలు సమర్పించారు. సాయంత్రం విశేషంగా అలంకరించిన కైలాస వాహనంపై విశాలాక్షి సమేత విశ్వేశ్వరస్వామి ఉత్సవమూ ర్తులను ఉంచి ఆ మాలలతో అలంకరించారు. మొదటి రోడ్డు, రెండో రోడ్డు మీదుగా ఊరేగిం చారు. కార్యక్రమంలో ఆలయ ఆలయ ఈఓ రమే్‌షబాబు, అనువంశీకుడు హోసూరు రామసుబ్రహ్మణ్యం, నరేంద్ర చౌదరి, శ్రీనివాసు లు, ఎర్రిస్వామి, పరమేష్, భక్తులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....